Share News

మండే...

ABN , Publish Date - Sep 08 , 2026 | 12:29 AM

భారీ వర్షాలు కురవాల్సిన సెప్టెంబరు మాసంలో ఎండలు మండు వేసవిని తలపిస్తున్నాయి. సోమవారం మండల కేంద్రంలో 36 డిగ్రీలు నమోదు కావడంతో బెంబేలెత్తుతున్నారు. గాలిలో ఉండే తేమ అధికంగా ఉండటంతో 40 డిగ్రీలుగా ఉక్కపోతతో అల్లాడుతున్నట్లు ప్రజలు అంటున్నారు. ఉదయం 10 గంటలు దాటితే బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు

మండే...
చాగలమర్రిలో నిర్మానుష్యంగా ప్రధాన రహదారి

చాగలమర్రిలో 36 డిగ్రీలు నమోదు ఫ ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు

చాగలమర్రి, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలు కురవాల్సిన సెప్టెంబరు మాసంలో ఎండలు మండు వేసవిని తలపిస్తున్నాయి. సోమవారం మండల కేంద్రంలో 36 డిగ్రీలు నమోదు కావడంతో బెంబేలెత్తుతున్నారు. గాలిలో ఉండే తేమ అధికంగా ఉండటంతో 40 డిగ్రీలుగా ఉక్కపోతతో అల్లాడుతున్నట్లు ప్రజలు అంటున్నారు. ఉదయం 10 గంటలు దాటితే బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. పచ్చటి వరిమడులతో కళకళలాడ్సిన పొలాలు ఎడారిలా మారాయి. వారంరోజులుగా వాతావరణంలో మార్పులు రావడంతో పిల్లలు, పెద్దలు, కూలీలు, మహిళలు, వృద్ధులు అల్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎంతకాలం ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Sep 08 , 2026 | 12:29 AM