నమ్మండి.. ఇది వైద్యశాల
ABN , Publish Date - Jul 17 , 2026 | 12:24 AM
గ్రామంలోని ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో పిచ్చి మొక్కలు పెరిగాయి. దీంతో దోమలు విపరీతంగా పెరిగి మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది.
చాగలమర్రి 24 గంటల ఆసుపత్రిలో పిచ్చి మొక్కలు.. రోగులకు ఇబ్బంది
చాగలమర్రి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): గ్రామంలోని ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో పిచ్చి మొక్కలు పెరిగాయి. దీంతో దోమలు విపరీతంగా పెరిగి మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది. ఈ ఆసుపత్రికి రోజుకు వందకు పైగా ఓపీకి రోగులు వస్తుంటారు. ఇద్దరు మహిళా వైద్యులు, సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రసవాల కోసం పగలు, రాత్రి గర్భిణులు వస్తుంటారు. రోగం నయం చేసుకునేందుకు ఇక్కడికి వస్తే కొత్త రోగం వచ్చేలా ఉందని రోగులు ఆందోళన చెందుతున్నారు. 24 గంటల స్వచ్ఛత గురించి మాట్లాడే అధికారులు ఆసుపత్రిని పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.