శిథిలావస్థలో పశు వైద్యశాల
ABN , Publish Date - Jul 06 , 2026 | 12:13 AM
మండల కేంద్రంలో పశువైద్యశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. 2011లో రూ.10.6 లక్షలతో నిర్మించారు. ఈ వైద్యశాల కింద బోడెమ్మనూరు, పుచ్చకాయపల్లె, కాకరవాడ, రూపనగుడి, సుద్దమల్ల, పడిగెపాడు, ఉయ్యాలవాడ గ్రామాల్లోని 10వేల పశువులు ఉన్నాయి.
గోడలకు పగుళ్లు, కూలిన భవనం వెనుక భాగం ఫ ఆసుపత్రిలోకి విష సర్పాలు, సిబ్బందికి ఇబ్బందులు
ఉయ్యాలవాడ, జూలై 5(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో పశువైద్యశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. 2011లో రూ.10.6 లక్షలతో నిర్మించారు. ఈ వైద్యశాల కింద బోడెమ్మనూరు, పుచ్చకాయపల్లె, కాకరవాడ, రూపనగుడి, సుద్దమల్ల, పడిగెపాడు, ఉయ్యాలవాడ గ్రామాల్లోని 10వేల పశువులు ఉన్నాయి.
పగుళ్లు ఇచ్చిన గోడలు
భవనం గోడలు పగుళ్లు ఇవ్వడంతో సిబ్బంది భయపడుతూ విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పశువైద్యుడు, అసిస్టెంట్ పనిచేస్తున్నారు. రోజుకు దాదాపు 60మంది వరకు రైతులు, పశుపోశకులు వస్తుంటారు. గోడలకు రంధ్రాలు ఉండటంతో వర్షపునీరు లోపలికి వస్తోందని, విష సర్పాలు వస్తున్నాయని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఈ వైద్యశాల పరిధిలో 10 వేలకు పైగా పశువులకు వైద్యసేవలు అందిస్తున్నారు. వైద్య సదుపాయాలు అన్నీ ఉన్నా భవనం సరిగా లేక చికిత్సకు ఆటంకాలు ఎదురువుతున్నాయి. పశువైద్యశాలకు మరమతులు చేయించి ఆదుకోవాలని సిబ్బంది, పాడి రైతులు కోరుతున్నారు.