కేంద్ర బడ్జెట్‌పై ఆశలు..!
ABN , Publish Date - Jan 30 , 2026 | 11:26 PM
కేంద్ర బడ్జెట్ రేపే.. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధం చేశారు.
స్టేట్ క్యాన్సర్ యూనిట్‌కు రూ.20 కోట్లు ఇవ్వాలి
ట్రిపుల్ ఐటీడీఎం కాలేజీ విస్తరణకు నిధులు ఇవ్వాలి
ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్ పురోగతిని వేగవంతం చేయాలి
ఉమ్మడి జిల్లా రైల్వే ప్రాజెక్టులపై దృష్టి సారించాలి
రేపు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర బడ్జెట్ రేపే.. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధం చేశారు. గతేడాది తీసుకున్న నిర్ణయం వల్ల ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్ అభివృద్ధికి రూ.1.100 కోట్లతో టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. దూపాడు-నంద్యాల వయా ఓర్వకల్లు రైలు మార్గం నిర్మాణానికి నిధులు ఇవ్వాలి. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేసిన ట్రిపుల్ ఐటీడీఎం కళాశాల, స్టేట్ క్యాన్సర్ యూనిట్లకు ఈ బడ్జెట్ కేటాయింపుల్లో సముచిత స్థానం కల్పించాలి. ఉమ్మడి జిల్లాలో రైల్వే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలి. వెనుకబడి జిల్లాల అభివృద్ధిలో భాగంగా జిల్లా ప్రగతికి నిధులు కేటాయించాలి. రేపు పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్-2026-27పై జిల్లా కర్నూలు ప్రజలు గంపెడు ఆశతో ఎదురు చూస్తున్నారు.
కర్నూలు, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో ‘స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్’ ఏర్పాటు చేశారు. రూ.140 కోట్లు నిధులు కేటాయించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఇన్‌స్టిట్యూట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి క్యాన్సర్ చికిత్సకు అవసరమైన అధునాత సాంకేతిక యంత్రాలను సమకూర్చారు. పెట్ సిటి స్కాన్ పరికరం కేంద్రం సరఫరా చేయాల్సి ఉంది. ఇందుకోసం రూ.19 కోట్లు నిధులు కావాలి. సర్జికల్ అంకాలజీ పరికరాలు, గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం, అందుకు అవసరమైన పరికరాలు, ఎండోస్కోపి, కొలనోస్కోపి సహా రెండు ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకోసం రూ.20 కోట్లు నిధులు కావాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ నిధులను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు దమాషా ప్రకారం కేటాయించాలి. కేంద్ర బడ్టెట్‌లో అవసరమైన నిధులు కేటాయించి స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధికి చేయూత ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.
ట్రిపుల్ ఐటీడీఎం ప్రగతిపై దృష్టి పెట్టాలి
కర్నూలు నగర శివారులో జగన్నాథగట్టుపై 152 ఎకరాల్లో ఇండి యన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫాక్చరింగ్ (ట్రిపుల్ ఐటీడీఎం) కళాశాల ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ కాలేజీ మంజూరు చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.296 కోట్లతో కాలేజీ క్యాంపస్ నిర్మాణం చేపట్టారు. తరగతి భవ నాలు-16, ల్యాబ్స్, లైబ్రరీలు-22, మూడు సెమినార్ హాల్స్, మల్టీపర్పస్ హాల్, కంప్యూటర్ ల్యాబ్,. రెండు మెస్ బ్లాకులు, డైరెక్టర్ బంగ్లా, ఫ్యాకల్టీ క్వార్టర్స్-20 హెల్త్ అండ్ వెల్‌నెస్ సెం టర్ వంటివి నిర్మించారు. కాలేజీ విస్తరణలో భాగంగా డ్రోన్ ల్యాబ్, రోబోటిక్ ల్యాబ్, కంప్యూటర్స్, ఎలకా్ట్రనిక్ అండ్ కమ్యూ నికేషన్ ల్యాబ్, మెకానికల్ బ్యాబ్, 80 స్టాఫ్ క్వార్టర్స్, అడిషనల్ ల్యాబ్స్, కాన్ఫరెన్స్ హాల్, క్రికెట్ గ్రౌండ్, హాస్పెటల్ నిర్మాణాల కోసం దాదాపు రూ.350 కోట్లు నిధులు అవసరమని గతేడాది ప్రతిపాదనలు పంపారు. అయితే.. నాడు బడ్జెట్‌లో విద్యా సంస్థ నిర్వహణ, జీతాలకు రూ.26.49 కోట్లు ఇచ్చారు. ఈ బడ్జెట్‌లోనైనా మౌలిక వసతులు, విస్తరణ కోసం అవసరమైన నిధులు ఉన్నత సాంకేతిక విద్యా గ్రాంట్ కింద కేటాయించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
రైల్వే రవాణాతో పారిశ్రామిక పురోగతి
ఓర్వకల్లు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ కేంద్రంగా వివిధ పరిశ్రమలు రావాలంటే రైల్వే రవాణా సౌకర్యం కల్పించాలి. 2024-25 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్ ప్రకటన చేశారు. హైదరాబా దు-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా ‘ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్’ అభివృద్ధి చేస్తామని స్పష్టంగా వెల్లడించారు ‘నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రొగ్రాంలో భాగంగా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా ఫేజ్-1 కింద 2,621 ఎకరాల్లో రూ.2,786 కోట్లతో అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇండస్ట్రియల్ నోడ్ పరిధిలో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, తాగునీరు.. వంటి పనులకు రూ.1,100 కోట్లతో టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. వారం పది రోజుల్లో పనులు ప్రారంభానికి ఏపీఐఐడీసీ అధికారులు సన్నహాలు చేస్తున్నారు. ఇక్కడికి నాన్ మెటలిక్ మినరల్ పరిశ్రమలు, ఆటోముబైల్ రంగం విడిభాగాలు తయారీ, పునరుత్పాదక పరిశ్రమలు, ఎలక్ట్రికల్ అండ్ ఎలకా్ట్రనిక్ పరికరాలు, ఏరోస్పెస్ అండ్ డిషెన్స్ హార్డ్‌వేర్, ఫార్మాస్యూటికల్స్, వజ్రాలు, బంగారు అభరాలు తయారి, వస్త్ర ఉత్పత్తి రంగ పరిశ్రమల ఏర్పాటుకు రూ.12 వేల కోట్లు పెట్టుబడులు వస్తాయని నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఐసీడీసీ) అంచనా వేసింది. ఆయా పరిశ్రమలు రవాలంటే రైల్వే రవాణా ఎంతో కీలకం. దూపాడు(కర్నూలు) - నంద్యాల వయా ఓర్వకల్లు రైల్వే నిర్మాణం ప్రతిపాదన ఉంది. ఈ రైలు మార్గానికి రేపటి బడ్జెట్‌లో మోక్షం లభించేలా ఉమ్మడి జిల్లా ఎంపీలు ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఉమ్మడి జిల్లా రైల్వే ప్రాజెక్టులు పట్టాలెక్కేనా?
మంత్రాలయం-కర్నూలు వయా ఎమ్మిగనూరు నూతన రైల్వేలైన్ పశ్చిమ ప్రాంత ప్రజల అందని ద్రాక్షగానే మారింది. 50 ఏళ్లుగా ఈ రైలు మార్గం కోసం జిల్లా ప్రజాప్రతినిధులు గొంతెత్తుతున్నా.. కేంద్ర పాలకుల్లో స్పందన లేదు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు ట్రాఫిక్ సర్వే చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా 2004 బడ్జెట్‌లో రూ.166 కోట్లు కేటాయించి డీపీఆర్ తయారికి శ్రీకారం చుట్టారు. మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్ (తుంగభద్ర), మాధవరం, మంత్రాలయం, ఇబ్రహీంపురం, నందవరం, ఎమ్మిగనూరు, గోనేగండ్ల, కోడు మూరు మీదుగా కర్నూలు సమీప ంలోని దూపాడు రైల్వే స్టేషన్ వరకు 110 కి.మీల రైలు మార్గం నిర్మించాలని డీపీఆర్ ఇచ్చారు. ఏళ్లు గడిచినా మోక్షం లభించడం లేదు. అలాగే.. కర్నూలు రైల్వే స్టేషన్‌లో ఉన్న రైల్వే గూడ్‌షెడ్లను దూపాడుకు మార్చాలనే ప్రతిపాదన ఉంది. అమృత్ స్టేషన్‌లో భాగంగా రూ.43 కోట్లతో కర్నూలు సిటీ రైల్వే స్టేషన్, రూ.11 ఆదోని రైల్వే స్టేషన్ ఆధునికీకరణ నత్తతో పోటి పడుతున్నాయి. మహాబూబ్‌నర్-డోన్ వయా కర్నూలు డబ్లింగ్ రైల్వేలైన్, విద్యుదీకరణ పనులకు కేంద్రం ఆమోదం తెలిపినా పనులు మొదలు కాలేదు. హైదరాబాద్-బెంగళూరు వయా కర్నూలు, డోన్ మీదుగా హైస్పీడ్ రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపినా.. సర్వేలో ఏళ్లు గడిచిపోతున్నాయి.
రైల్వే కోచ్ పరిశ్రమ ప్రారంభం ఎప్పుడో..?
కర్నూలు రైల్వే కోచ్ మిడ్ - లైఫ్ రిహాబిలిటేషన్ వర్క్ షాప్ (ఎంఎల్‌ఆర్) పదేళ్లుగా నిర్మాణంలోనే ఉంది. ఇప్పటికే దాదాపుగా రూ.250 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. కర్నూలు మండలం పంచలింగాల వద్ద 142 ఎకరాల్లో రూ.110 కోట్లతో చేపట్టిన ఈ పరిశ్రమను 2013-14లో రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి రైల్వే కోచ్ పున రుద్ధరణ పరిశ్రమ తీసుకురావడంలో అప్పటి రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కృషి ఉంది. ఇది ప్రారంభమైతే 3 వలే మందికి ప్రత్యేక్షంగా ఉపాధి లభిస్తుందని అంటున్నారు. ఇప్పటికే 85-90 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. బ్యాలెన్స్ పనులకు అవసరమైని నిధులు కేటాయించాలి. తక్షణమే ఈ పరిశ్రమను ప్రారంభించాలి. జిల్లా ప్రజల దశాబ్ద కాలపు నిరీక్షణకు తెర దించాలి.