గుడికట్ల పూజారులకు గౌరవ వేతనాలు
ABN , Publish Date - Apr 05 , 2026 | 11:34 PM
త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనంతో పాటు ఆలయ నిర్వహణకు నిధులు కూడా ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. విద్యతోనే కురుబల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
కర్నూలు ఎడ్యుకేషన్/ కర్నూలు హాస్పిటల్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనంతో పాటు ఆలయ నిర్వహణకు నిధులు కూడా ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. విద్యతోనే కురుబల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కురుబలకు ప్రాధాన్యమిచ్చేలా టీడీపీ చర్యలు తీసుకుంటుందన్నారు. కర్నూలులో ఆదివారం జరిగిన కురుబల ఆత్మీయ సమావేశంలో ఎంపి బస్తిపాటి నాగరాజుతో కలిసి ఆమె పాల్గొని ప్రసంగించారు. కురుబలు ఐకమత్యంగా ఉండాలన్నారు. భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడమే కాకుండా, శాశ్వత జీవో కూడా ఇచ్చామన్నారు. త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనం అందించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇదే విషయమై ఇటీవల సీఎం చంద్రబాబుతో చర్చించినట్లు తెలిపారు. గౌరవ వేతనంతో పాటు ఆలయ నిర్వహణకు నిధులు కూడా ఇస్తామన్నారు.
నూతన కార్యవర్గం ఏర్పాటు : కురుబ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన ఎస్‌కే మల్లికార్జున, గౌరవాధ్యక్షుడిగా తట్టె అర్జునరావు, వర్కింగ్ ప్రెసిడెంటుగా రెడ్డి ప్రసాద్, ఉపాధ్యక్షులుగా కర్నూలు శ్రీనివాసరావు, మదనపల్లి లక్ష్మన్న, గుంటూరు సత్యనారాయణరాజు, నంద్యాల శ్రీరాములు, జనరల్ సెక్రటరీగా ఏలూరి సూర్యనారాయణ, కోశాధికారిగా సంతల శ్రీరాములును ఎంపిక చేశారు. కార్యదర్శులుగా మహేంద్రను ఎంపిక చేశారు. అదేవిధంగా కార్యదర్శులుగా మహేంద్ర, చెన్నప్ప, దొన స్వామి, వెంకటేశ్వర రావు, ఆదోని సంతోష్, పెనుకొండ రామాంజనే యులు, శ్రీనివాసులు, బాపట్ల పరమేశ్వర రావు, బక్క రామకృష్ణ అనంతరం మంత్రి సవితకు కురుబ సామాజిక వర్గీయులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప తదితరులు పాల్గొన్నారు.