యోగాతో సంపూర్ణ ఆరోగ్యం: మంత్రి బీసీ
ABN , Publish Date - Jun 22 , 2026 | 12:21 AM
యోగాతో సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
బనగానపల్లె, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): యోగాతో సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం బనగానపల్లెలో మంత్రి క్యాంపు కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలతో కలసి యోగాసనాలు వేసి యోగా ప్రాముఖ్యతను వివరించారు. మంత్రి బీసీతో పాటు పలువురు యోగా సాధన చేశా రు. ఈ సందర్భంగా మంత్రి బీసీ మాట్లాడుతూ ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యానికి, ఆత్మ విశ్వాసానికి యోగా ఒక అద్భుతమైన సాధనమన్నారు. యోగా కేవలం వ్యాయామమే కాదన్నారు. యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సమతుల్యతను సాధించే జీవన విధానమన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యోగ సాధనను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఉదయాన్నే పెద్ద ఎత్తున మంత్రి క్యాంపు కార్యాలయానికి ప్రజలు, యువత, విద్యార్థులు, కూటమి పార్టీ నేతలు, అధికారులు, కార్యకర్తలు రావడంతో వాళ్లతో కలసి మంత్రి యోగా సాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.