Share News

హోలీ.. రంగుల కేళి

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:06 AM

రాయలసీమ యూని వర్సిటీలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు.

హోలీ.. రంగుల కేళి
రాయలసీమ యూనివర్సిటీలో హోలీ సంబరాల్లో విద్యార్థులు

యువత కోలాహలం

కర్నూలు అర్బన్‌, మార్చి 3(ఆంధ్రజ్యోతి): రాయలసీమ యూని వర్సిటీలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం వర్సిటీలోని విద్యార్థులు ఒకరికొకరు రంగులు చల్లుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ వర్సిటీ సహాయ కార్యదర్శి రామకృష్ణ, సందీప్‌ నాయక్‌, సీమ కృష్ణలు మాట్లాడారు. హిందూ పురాణ కథ ప్రకారం చెడుపై మంచి గెలిచిందని సంకేతం అన్నారు.

గూడూరు: మండల కేంద్రమైన గూడూరులో హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. యువతీ, యువకులు ఒకరిపైనోకరు రంగులు చల్లుకున్నారు. మంగళవారం గూడూరులోని కిట్టు హోటల్‌ సమీపంలో యువకులు ఉట్టి ఏర్పాటు చేశారు. రంగులు చల్లు కుం టూ ఉట్టిని కొట్టారు. అలాగే మండలంలోని ఆయా గ్రామాల్లో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

హోలీ కొత్త వెలుగులు నింపాలి

రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ

కర్నూలు కల్చరల్‌: హోలీ వేడుకలు అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ ఆకాం క్షించారు. మంగళవారం హోలీ పండుగను పురస్కరించుకొని నగర శివారులోని టోల్‌ప్లాజా వద్దగల లాస్య అమ్యూజ్‌మెంట్‌ పార్కులో, స్పార్టన అండ్‌ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘రంగ్‌ బర్సే’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సయీం, భువన, చరితారెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో ఏర్పాటు చేసిన లక్కీడిప్‌ను టీజీ వెంకటేశ తీసి విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. టీజీ వెంక టేశ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఆబాలగోపాలం ఉత్సాహంగా నిర్వ హించుకునే వేడుక హోలీ అని గుర్తు చేశారు. ఈ పండుగను ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు.

Updated Date - Mar 04 , 2026 | 12:06 AM