ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడి
ABN , Publish Date - Jun 12 , 2026 | 12:11 AM
ప్రకృతి వ్యవసాయంతో భూమి సారవంతమై రైతులకు అధిక దిగుబడి లభిస్తుందని కలెక్టర్ ఏ.సిరి అన్నారు.
కలెక్టర్ ఏ. సిరి
గూడూరు, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వ్యవసాయంతో భూమి సారవంతమై రైతులకు అధిక దిగుబడి లభిస్తుందని కలెక్టర్ ఏ.సిరి అన్నారు. గురువారం గూడూరులో పర్యటించిన కలెక్టర్ రైతులు శేఖర్, రామకృష్ణ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న పొలాలను పరిశీలించారు.కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ వ్యవసాయంలో అధికంగా రపాయన ఎరువులపై ఆధారపడటంతో రైతుల ఖర్చులు పెరుగుతున్నాయన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా పశుసంపద ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టాలన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా సాధిస్తున్న ఫలితాలను రైతు శేఖర్ కలెక్టర్‌కు వివరించారు. రైతు రామకృష్ణ సాగు చేస్తున్న పొలాన్ని పరిశీలిస్తూ అక్కడ అమలు చేస్తున్న డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను కలెక్టర్ పరిశీలించారు. ఆమె వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మీ, ఆర్డీవో సందీప్ కుమార్, స్వర్ణగ్రామ, వార్డు అధికారి భాస్కర్ నాయుడు, డీపీవో భాస్కర్, తహసీల్దార్ వెంకటేష్ నాయక్, కమిషనర్ రమేష్ బాబు, ఏవో దస్తగిరి రెడ్డి పాల్గొన్నారు.