భానుడి ఉగ్రరూపం
ABN , Publish Date - Apr 14 , 2026 | 11:52 PM
ఏప్రిల్‌లోనే ఎండలు హడలెత్తిస్తున్నాయి. ఆర్‌ఐ అబ్దుల్‌సత్తార్ సమాచారం మేరకు మంగళవారం చాగలమర్రిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
చాగలమర్రిలో 42 డిగ్రీలు నమోదు.. ప్రజలు బెంబేలు
చాగలమర్రి, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): ఏప్రిల్‌లోనే ఎండలు హడలెత్తిస్తున్నాయి. ఆర్‌ఐ అబ్దుల్‌సత్తార్ సమాచారం మేరకు మంగళవారం చాగలమర్రిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు తన పత్రాపాన్ని చూపడంతో బయటకు రావాలంటే జనం హడలిపోతున్నారు. ఇక 12 గంటలయ్యేసరికి రహదారులు నిర్మూనుషంగా మారిపోతున్నాయి. ఎండ వేడిమికి జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. తప్పని పరిస్థితుల్లో ఉద్యోగులు, వ్యాపారులు గొడుగు సాయంతో విధులకు వెళ్తున్నారు. అయితే తరచూ చల్లటి మజ్జిగ, కొబ్బరి నీరు తాగాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావవొద్దని వైద్యులు సూచిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో రావలసివేస్తే తలకు టోపీ, గొడుకు సాయంతో రావాలని, ఉదయం 11 గంటలలోపు, సాయంత్రం 5 గంటల తర్వాతే పనులు చూసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఎండలు ఇంకా పెరిగే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను హెచ్చరిస్తోంది.