Share News

మండిపోతున్నాయి..

ABN , Publish Date - Nov 16 , 2026 | 12:01 AM

మండలంలో కూరగాయాల ధరలు మండిపోతున్నాయి. ఆదివారం సంజామలలో నిర్వహించిన వారపు సంతలో ఒక్క టామోటా మినహాయించి అన్ని కూరగాయల ధరలు సామాన్యునికి అందనంతగా ధరలు పెరిగిపోయాయి.

మండిపోతున్నాయి..
సంజామల వారపు సంతలో కూరగాయలు కొంటున్న వినియోగదారులు

సంజామల వారపు సంతలో కొండెక్కిన కూరగాయల ధరలు..

కిలో రూ.80వరకు విక్రయం..

సంజామల, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): మండలంలో కూరగాయాల ధరలు మండిపోతున్నాయి. ఆదివారం సంజామలలో నిర్వహించిన వారపు సంతలో ఒక్క టామోటా మినహాయించి అన్ని కూరగాయల ధరలు సామాన్యునికి అందనంతగా ధరలు పెరిగిపోయాయి.

కిలో రూ.80వరకు..

మర్కెట్‌లో కూరగాయల ధరలు పెరిగిపోవడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. కిలో ఉల్లి రూ.60, బీర రూ.80, బెండ రూ.80, కాకర రూ.80, క్యారెట్‌ రూ.80, బీన్స్‌ రూ.80, బంగాళదుంప రూ.50లు, టమేటా రూ.25 మేరకు విక్రయించారు.

మధ్య తరగతి ప్రజల బెంబేలు..

రెండు, మూడు రకాల కూరగాయలు కొనాలంటేనే వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. సంతలో వారానికి సరిపడా కూరగాయలు కొనాలంటే రూ.600 అవుతోందని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి కూరగాయల ధరలు అదుపులోకి తీసుకురావాలని వినియోగదారులు కోరుతున్నారు.

Updated Date - Nov 16 , 2026 | 12:01 AM