వ్యవసాయ విద్యకు అఽధిక ప్రాధాన్యం
ABN , Publish Date - Jul 02 , 2026 | 11:21 PM
దేశంలో వ్యవసాయ విద్యకు అధిక ప్రాధాన్యత ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసా య విద్యార్ధులు చక్కగా చదివి వ్యవసాయ రంగాన్ని మరింత మరింత విస్తరింప చేయాలని ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్ ఆఫీసర్ డి. సంపత్ కుమార్ తెలిపారు.
ఆచార్య ఎన్‌జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ
డీన్ ఆఫ్ స్టూడెంట్ అపైర్ ఆఫీసర్ సంపత్‌కుమార్
మహానంది, జూలై 2 (ఆంధ్రజ్యోతి): దేశంలో వ్యవసాయ విద్యకు అధిక ప్రాధాన్యత ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసా య విద్యార్ధులు చక్కగా చదివి వ్యవసాయ రంగాన్ని మరింత మరింత విస్తరింప చేయాలని ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్ ఆఫీసర్ డి. సంపత్ కుమార్ తెలిపారు. గురువారం రాత్రి మహానంది సమీపంలోని ఆచా ర్య ఎన్‌జి రంగా వ్యవసాయ కళాశాల హాస్టల్, కాలేజీ డేను అసోసియేట్ డీన్ శ్యామ్‌రాజ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సంపత్‌కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులనుద్దేశించి మాట్లా డారు. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా వ్యవసాయ విద్యను పూర్తి చేయాలని కోరారు. ఎప్పటికప్పుడు సరికొత్త వంగడాలను సృష్టించాలన్నారు. కళాశాల హాస్టల్ డే వార్షికోత్సవం పురస్కరిం చుకొని నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు ప్రముఖులు జ్ఞాపికలను అందజేశారు. నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ డాక్టర్ జయలక్ష్మి, ఫైథాలజీ శాస్త్రవేత్త జాన్సన్,మాజీ బోర్డు మెంబర్ విజయ భాస్కర్, శాస్త్రవేత్తలు వీరయ్య, వై. సతీష్‌కుమార్, నారాయణరావు, తివిక్రమ్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, మాధవి, ప్రభాకర్ పాల్గొన్నారు. విద్యార్థు లు నిర్వహించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకొన్నాయి.