ప్రజా సంఘాల మద్దతుతో హైకోర్టు బెంచ్ సాధిస్తాం
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:23 AM
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని, ప్రజా సంఘాల మద్దతుతో బెంచ్ సాధించి తీరుతామని కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, జేఏసీ అధ్యక్షుడు బి.చంద్రుడు తెలిపారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రుడు
కర్నూలు లీగల్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని, ప్రజా సంఘాల మద్దతుతో బెంచ్ సాధించి తీరుతామని కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, జేఏసీ అధ్యక్షుడు బి.చంద్రుడు తెలిపారు. శనివారం హైకోర్టు బెంచ్ సాధించడానికి ప్రజా సంఘాల నాయకులతో స్థానిక బార్ అసోసియేషన్ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజా సంఘాలు న్యాయవాదుల ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని తమ వంతు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా రాయలసీమ అభివృద్ధి చెందడం లేదని, కూటమి ప్రభుత్వమైనా కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి రాయలసీమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, జనసేన, విద్యార్థి, రైతు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
13వ రోజుకు చేరిన దీక్ష
హైకోర్టు బెంచ్ కోసం కోర్టు విదులను బహిష్కరించి నిరాహారదీక్షలు చేస్తున్న న్యాయవాదులు శనివారం 13 వ రోజు కొనసాగించారు. శనివారం న్యాయవాదులు వై.జయరాజు,వి.నాగలక్ష్మీదేవి, కే.కపిలేశ్వరయ్య, మురళీమోహన్ తదితరులు శిబిరాన్ని సందర్శించి సంఘీబావాన్ని వ్యక్తం చేశారు. శనివారం నిరాహార దీక్షలో పాల్గొన్న వారిలో శెట్టి నీరజ, ఎస్.మహ్మద్ అన్వర్ అన్వర్ సాదర్, జి.గోపాల్ యాదవ్, ఈడిగ బుద్ధిరాజ్ గౌడు, గైక్వాడ్ భరత్ కుమార్, షేక్ మాసూంవలి, పీఎస్ హరీష్ రెడ్డి పాల్గొన్నారు.