శ్రీశైలంలో హైకోర్టు న్యాయమూర్తి పూజలు
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:09 AM
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ హరిహరనాథ్ శర్మ కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు.
శ్రీశైలం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ హరిహరనాథ్ శర్మ కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వీరికి వేదపండితులు తిలకధారణ చేయగా ఈవో శ్రీని వాసరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. జడ్జి, కుటుంబ సభ్యు లు స్వామికి గర్భాలయ అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాకారంలోని పరివార ఆలయాలను కూడా దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి ప్రాకార మండపంలో వేద పండితులు జడ్జి కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనాలు వల్లించి తీర్థప్ర సాదాలతో పాటు పరిమళ విభూది, శేషవస్త్రాలు, జ్ఞాపికను అందజేశారు.