మహాయోగి లక్ష్మమ్మ అవ్వ సన్నిధిలో హైకోర్టు జడ్జి
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:03 AM
రాష్ట్ర హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి శనివారం పట్టణంలోని మహాయోగి లక్ష్మమ్మ అవ్వను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
ఆదోని టౌన్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి శనివారం పట్టణంలోని మహాయోగి లక్ష్మమ్మ అవ్వను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ధర్మకర్తలు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. కుటుంబ సభ్యు లతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారులు అమ్మవారి శేష వస్ర్తాలను, తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయ ధర్మకర్త కుటుంబానికి చెందిన రాయచోటి సుబ్బయ్య, రాచోటి విశ్వనాధం స్థానిక కోర్టు న్యాయాధికారులు పీజే సుధ, యజ్ఞనారాయణ, యం.లీలా సాయి సుభాష్, జీ.అర్చన, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. హైకోర్టు జడ్జి పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాల్లో గట్టి భద్రత ఏర్పాటు చేశారు.