Share News

మల్లన్న సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి

ABN , Publish Date - Oct 04 , 2026 | 11:17 PM

శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.

మల్లన్న సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
శ్రీశైలంలో కుటుంబ సభ్యులతో జస్టిస్‌ రమేశ్‌

శ్రీశైలం, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న ఆయనకు ఈవో శ్రీనివాసరావు సంప్రదాయబద్ధంగా వేదపండితులతో తిలకధారణ చేయించి పూలమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాన ధ్వజస్తంభానికి నమస్కరించుకున్న జడ్జి, ఆయన కుటుంబ సభ్యులు స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పరివార దేవతాలయాలను కూడా దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి ప్రాకార మండపంలో అర్చక వేదపండితులు న్యాయమూర్తి కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనాలు పఠించి తీర్థప్రసాదాలు, లడ్డూ ప్రసాదం, పరిమళ విభూది, స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని అందించి శేషవస్త్రాలతో సన్మానించారు. శ్రీశైల వైభవాన్ని చూపే కాఫీ టేబుల్‌ బుక్‌ను ఈవో అందజేశారు.

Updated Date - Oct 04 , 2026 | 11:17 PM