Share News

కర్నూలులో త్వరలో హైకోర్టు బెంచ

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:13 AM

కర్నూలుకు త్వరలో హైకోర్టు బెంచ వస్తుందని, ఈ విషయాన్ని సీఎం చంద్ర బాబు ఇటీవల తనకు తెలిపారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత పేర్కొన్నారు.

కర్నూలులో త్వరలో హైకోర్టు బెంచ
సుద్దవాగు రక్షణ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి

ఎన్నికల హామీలను అమలు చేస్తున్నాం

పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత

సుద్దవాగు రక్షణ గోడ నిర్మాణానికి శంకుస్థాపన

కర్నూలు న్యూసిటీ, జూలై 29(ఆంధ్రజ్యోతి): కర్నూలుకు త్వరలో హైకోర్టు బెంచ వస్తుందని, ఈ విషయాన్ని సీఎం చంద్ర బాబు ఇటీవల తనకు తెలిపారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత పేర్కొన్నారు. బుధవారం నగరంలోని 23, 24 వార్డుల పరిధిలోని కేసీ కెనాల్‌ సమీపంలో సుద్దవాగు రక్షణ గోడ నిర్మాణానికి నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసుతో కలిసి శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీ లను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. వర్షాలు కురిసిన ప్రతిసారి నీటి ప్రవాహం కారణంగా శ్రీరామ్‌నగర్‌, లక్ష్మీనగర్‌ ప్రాం తాల్లోని సుద్దవాగు పరిసరాల్లో నీరు ఇళ్లలోకి చేరుతుండేదన్నారు. ఈ సమస్యకు పరిష్కరించేందుకు జలవనరుల శాఖ రూ.2.50 కోట్ల వ్యయంతో 250 మీటర్ల మేర రక్షణ గోడ నిర్మాణానికినికి శంకు స్థాపన చేశామన్నారు. కమిషనర్‌ చల్లా ఓబులేసు మాట్లాడుతూ అధిక వర్షాల సమయంలో సుద్దవాగు పరిసర ప్రాంతాల్లో నీటి ప్రవా హన్ని నియంత్రించేందుకు రక్షణ గోడ నిర్మాణం అత్యంత అవస రమన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఎస్‌ఈ జే.రమణ మూర్తి, జలవనరుల శాఖ ఎస్‌ఈ శైలేశ్వర్‌, ఎంఈ విజయరాజు, నగ రపాలక ఎంఈ గిరిరాజు, డీఈఈ నరేష్‌, ఏఈ జనార్దన, జలవ నరు ల శాఖ డీఈఈ బి.శ్రీనివాసనాయక్‌, విజయకుమార్‌, ప్రజారోగ్య అధి కారి డా.ఎం.రఘు, శానిటరీ సూపర్‌వైజర్‌ రమేష్‌బాబు, పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2026 | 12:13 AM