Share News

ట్రూ అప్‌ చార్జీలు తగ్గించడంతో భరసా

ABN , Publish Date - Jan 04 , 2026 | 11:48 PM

విద్యుత్‌ ట్రూ అప్‌ చార్జీలను తగ్గించి, సీఎం చంద్రబాబు తగ్గించడంతో పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించారనీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

ట్రూ అప్‌ చార్జీలు తగ్గించడంతో భరసా
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

ఓర్వకల్లు, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ ట్రూ అప్‌ చార్జీలను తగ్గించి, సీఎం చంద్రబాబు తగ్గించడంతో పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించారనీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. ఆదివారం తహసీల్దార్‌ కార్యాలయ ప్రాంగణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సుపరిపాలన అందిస్తున్నారన్నారు. 2019లో అధికారంలోకి వచ్చినర వైసీపీ ఐదేళ్లలో 9 సార్లు చార్జీలను పెంచిందన్నారు. విద్యుత్‌ బిల్లులు పెంచి రూ.కోట్లలో జేబులు నింపుకున్నారని ఆరోపించారు. విద్యుత్‌ను నాటి సీఎం జగన్‌ ఆదాయ వనరుగా మార్చుకుని రూ.1.29 లక్షలకోట్ల అప్పులు మిగిల్చారన్నారు. టీడీపీ కన్వీనర్‌ బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు సుధాకర్‌ రెడ్డి, నాగేశ్వరరెడ్డి, నాయకులు మోహన్‌ రెడ్డి, ఖాజామియా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2026 | 11:48 PM