కౌంటింగ్‌కు భారీ బందోబస్తు
ABN , Publish Date - Nov 02 , 2026 | 11:20 PM
కర్నూలు జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కోసం భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
750 మంది పోలీసు సిబ్బంది నియామకం
సీసీ కెమెరాలతో నిరంతర నిఘా
ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కోసం భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కర్నూలు కార్పొరేషన్, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలు, గూడూరు నగర పంచాయతీలలో మంగళవారం జరిగే ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. సోమవారం ఆయన కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరులోని కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్ర్టాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ టేబుళ్లు, బారికేడ్లు, ఏజెంట్ల ప్రవేశ మార్గాలు, పార్కింగ్ స్థలాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియ కోసం 750 మంది పోలీసు అదికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఇద్దరు ఏఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 35 మంది సీఐలు, 56 మంది ఎస్‌ఐలు, 200 మంది ఏఎ్‌సఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఆర్ సిబ్బంది, స్పెషల్ పార్టీలు, 4 ఫ్లటూన్లు, ఏపీఎస్పీ బలగాలను ఎన్నికల కౌంటింగ్ విధుల్లో నియమించామన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. గుర్తింపు కార్డులు కలిగిన వారినే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్టు అమలులో ఉంటుందన్నారు. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు, సభలు, డప్పులు, బాణాసంచా కాల్పడం పూర్తిగా నిషేధించామన్నారు. ప్రశాంత కౌంటింగ్‌కు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.