Share News

కౌంటింగ్‌కు భారీ బందోబస్తు

ABN , Publish Date - Nov 02 , 2026 | 11:14 PM

జిల్లా వ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ కోసం భారీ పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు.

కౌంటింగ్‌కు భారీ బందోబస్తు
ఎస్పీ సునీల్‌ షొరాన్‌

సీసీ కెమెరాలతో నిరంతర నిఘా : ఎస్పీ సునీల్‌ షొరాన్‌

నంద్యాల నూనెపల్లి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ కోసం భారీ పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు. నంద్యాల, డోన్‌, ఆత్మకూరు, నందికొట్కూరు మున్సిపాలిటీలతో పాటు బేతంచెర్ల నగరపంచాయతీల్లో మంగళవారం జరిగే ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ సునీల్‌ షొరాన్‌ వెల్లడించారు. సోమవారం ఆయన బేతంచెర్ల, డోన్‌, నంద్యాలలోని స్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాలను సందర్శించారు. ఎస్పీ మాట్లాడుతూ కౌంటింగ్‌ ప్రక్రియ కోసం 700 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. గుర్తింపు కార్డులు కలిగిన వారినే కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్టు అమలులో ఉంటుందన్నారు. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు, సభలు, డప్పులు, బాణాసంచా కాల్పడం పూర్తిగా నిషేధించామన్నారు.

Updated Date - Nov 02 , 2026 | 11:14 PM