Share News

దంచికొట్టిన వాన

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:58 PM

తీవ్ర వర్షాభావం కారణంగా వెలవెలబోయిన కల్వటాల సమీపంలోని ఎర్రవాగు జలకళ సంతరించుకుంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగు నీటితో నిండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాగులో నీటితో భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.

దంచికొట్టిన వాన
కొలిమిగుండ్ల మండలం కల్వటాల వద్ద ఎర్రవాగులో నిలిచిన నీరు

వర్షాలతో నిండుతున్న చెక్‌ డ్యాంలు, చెరువులు

హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

కొలిమిగుండ్ల, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): తీవ్ర వర్షాభావం కారణంగా వెలవెలబోయిన కల్వటాల సమీపంలోని ఎర్రవాగు జలకళ సంతరించుకుంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగు నీటితో నిండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాగులో నీటితో భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.

వర్షం.. పంటకు జీవం

చాగలమర్రి: మంగళవారం తెల్లవారుజామున మోస్తరు వర్షం కురిస పంటలకు జీవం పోసింది. శెట్టివీడు, చిన్నవంగలి, చింతలచెరువు, పెద్దవంగలి, కొలుములపేట, మద్దూరు, బ్రాహ్మణపల్లె, చిన్నబోదనం, పెద్దబోదనం, గొట్లూరు గ్రామాల్లో ఖరీ్‌ఫలో సాగుచేసిన మొక్కజొన్న, ఉల్లి, పసుపు, అరటి, వేరుశనగ, మినుము, వరి పంటలకు వర్షం ప్రాణం పోసింది. నెల రోజులకు పైగా వర్షాలు లేక వాడుముఖం పట్టిన పంటలు వర్షానికి పచ్చగా కళకళలాడుతున్నాయి. వర్షంతో ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగింది. రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పెద్దబోదనం బుచ్చమ్మ కోనేరువద్ద చెక్‌డ్యామ్‌ జలకళను సంతరించుకుంది. ఇంతవరకు ఒట్టిపోయిన చెక్‌డ్యామ్‌కు భారీ వర్షంతో నీరు చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పొలాలు, బోరుబావుల్లో నీటిమట్టం పెరిగి పంటల సాగుకు పయోగపడుతుందని రైతులు చెబుతున్నారు.

తడిసిన ధాన్యం

చాగలమర్రి: మండలంలో మంగళవారం తెల్లవారుజామున, ఉదయం 11 గంటల ప్రాంతంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. 18.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారి అబ్దుల్‌సత్తార్‌ తెలిపారు. తోడెండ్లపల్లె గ్రామంలో మోహన్‌ అనే రైతుకు చెందిన మొక్కజొన్న పంట నేలవాలి దెబ్బతినింది. చాగలమర్రి సర్వీసు రహదారిలో ఆరబెట్టిన మొక్కజొన్న ధాన్యం తడిసి దెబ్బతిని రైతులకు నష్టం వాటిల్లింది. అయితే బోర్ల కింద సాగు చేసిన మొక్కజొన్న, వేరుశనగ, మినుము, ఉల్లి, కంది, బొప్పాయి, అరటి, పసుపు, వరికి వర్షం ఊపిరి పోసింది.

రుద్రవరం: మండలంలో భారీ వర్షం కురవడంతో ముత్తులూరు మెట్ట వద్ద మొక్కజోన్న దిగుబడి తడిచిపోయి రైతులు నష్టపోయారు. పొలాల్లో నీరు నిలిచి పంట దెబ్బతినే అవకాశం ఉందని నరసాపురం రైతులు వాపోయారు.

Updated Date - Sep 22 , 2026 | 11:58 PM