Share News

కుండపోత వర్షం

ABN , Publish Date - Aug 07 , 2026 | 12:21 AM

మండల కేంద్రంలో గురువారం రాత్రి కుండపోత వర్షం కురిసింది

కుండపోత వర్షం
పశువైద్య కేంద్రం రహదారిపై మోకాళ్ల లోతులో నిలిచిన నీరు

చాగలమర్రి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో గురువారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. సాయంత్రం 6.45 నుంచి రాత్రి వరకు కురుస్తూనే ఉంది. రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల ప్రాంగణాల్లో వర్షపునీరు మోకాళ్లలోతు వరకు నిలిచింది. నెల నుంచి సరైన వర్షాలు లేక అన్నదాత దిగాలు చెందుతున్న తరుణంలో ఈ వర్షంతో హర్షవ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న, మినుము, కంది, పెసర, ఉల్లి పంటలకు ఈ వర్షం ప్రాణం పోసింది. ఎండవేడిమికి అల్లాడుతున్న ప్రజానీకానికి ఉపశమనం కలిగించింది.

Updated Date - Aug 07 , 2026 | 12:21 AM