దంచికొట్టిన వాన
ABN , Publish Date - Jun 08 , 2026 | 12:09 AM
మండలంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రుద్రవరం, కొండమాయపల్లె, మందలూరు, చందలూరు, నాగులవరం, వెలగలపల్లె, అప్పనపల్లె, గోనంపల్లె ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో వీధులు జలమయ్యాయి
రుద్రవరం, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రుద్రవరం, కొండమాయపల్లె, మందలూరు, చందలూరు, నాగులవరం, వెలగలపల్లె, అప్పనపల్లె, గోనంపల్లె ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో వీధులు జలమయ్యాయి. రైతులు ఇప్పటికే ధాన్యాన్ని భద్రపరచుకోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ వర్షానికి భూమి పదును అయిందని, సాగుకు అనుకూలంగా ఉంటుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోటకొండ గ్రామ సమీపంలో కోటకొండ- శ్రీరంగాపురం రహదారిపై చెట్టు కూలడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
చాగలమర్రి: కొద్దిపాటి వర్షానికే గ్రామంలోని ఆర్టీసీ బస్టాండు ప్రాంగణం నీటి కుంటగా మారింది. పెద్ద గుంతులు ఉండటంతో ఆ నీటిలో నుంచే బస్టాండులోకి వెళ్లాల్సి రావడంతో వాహనదారులు, ప్రయాణికుల అవస్థలు పడ్డారు