Share News

దంచికొట్టిన వాన

ABN , Publish Date - Mar 25 , 2026 | 12:02 AM

ఆత్మకూరులో మంగళవారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. ఉన్నట్లుండి ఆకాశం ఒక్కసారిగా చల్లబడి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఇదే క్రమంలో పెనుగాలుల ధాటికి పట్టణంలోని పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

దంచికొట్టిన వాన
అప్పారావువీధిలో కూలిన విద్యుత్‌ స్తంభం

పెనుగాలుల ధాటికి కూలిన విద్యుత్‌ స్తంభాలు

ఆత్మకూరులో నిలిచిన విద్యుత్‌ సరఫరా

ఆత్మకూరు, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరులో మంగళవారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. ఉన్నట్లుండి ఆకాశం ఒక్కసారిగా చల్లబడి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఇదే క్రమంలో పెనుగాలుల ధాటికి పట్టణంలోని పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రత్యేకించి అప్పారావువీధిలోని ఓ కూడలి వద్ద ఉన్న విద్యుత్‌ స్తంభం ఒక్కసారిగా కూలిపోవడంతో విద్యుత్‌ తీగలన్నీ నేలవాలాయి. అయితే అదృష్టవశాత్తు అక్కడ సీసీ రోడ్డు నిర్మిస్తుండటం వల్ల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్‌ అధికారులు వెంటనే విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. అయితే మంగళవారం రాత్రి వరకు కూడా ఈ మరమ్మతు పనులు పూర్తికాకపో వడంతో పలు కాలనీలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి ప్రజలు అవస్థ పడ్డారు.

Updated Date - Mar 25 , 2026 | 12:03 AM