సీఎం పర్యటనకు భారీ పోలీసు భద్రత
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:20 AM
మండలంలోని కొత్త బురుజు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సోమ వారం పర్యటనకు పోలీసు భద్రతా ఏర్పాట్లు భారీగా చేసినట్లు ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు.
10 మంది డీఎస్పీలు, 50 మంది సీఐలు
60 మంది ఎస్‌ఐలు, 900 మంది పోలీసులు
సీసీ కెమెరాలు, డ్రోన్లతో పటిష్ట నిఘా
కొత్తబురుజు, హెలిప్యాడ్ ప్రాంగణాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు
ఎస్పీ సునీల్ షెరాన్
డోన్ టౌన్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొత్త బురుజు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సోమ వారం పర్యటనకు పోలీసు భద్రతా ఏర్పాట్లు భారీగా చేసినట్లు ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. సీఎం పర్యటించే హెలిప్యాడ్, డోన్, కొత్తబురుజు సభా ప్రాంగణం వంటి ప్రాం తాలను ఆదివారం డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీ చేశారు. ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కలెక్టర్ రాజ కుమా రి, జేసీ కార్తీక్‌తో కలిసి హెలిప్యాడ్, సభా ప్రాంగణం, భోజనశాల తదితర ప్రాంతాలను కలియ తిరిగి పరిశీలించారు. అనంతరం పోలీసు అధికారుల సమావేశంలో మాట్లాడుతూ పోలీసు అధికారులందరూ అప్రమత్తంగా ఉండి సీఎం పర్యటనను సక్సెస్ చేయాలని ఆదేశించారు. సీఎం పర్యటనలో 10 మంది డీఎస్పీలు, 50 మంది సీఐలు, 60 మంది ఎస్‌ఐలతో పాటు 900 మంది భారీ పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలలో పోలీసు జాగిలాలు, బాంబ్ డిటెక్షన్ టీమ్ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీ చేశామన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకో వాలన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు, ఏఎస్పీ జావలి, హోంగార్డు డీఎస్పీ ప్రసాద్, డోన్ డీఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీలు ప్రమోద్, రవిబాబు, రాజేంద్ర ప్రసాద్, సీఐలు ఇంతియాజ్ బాషా, సీఎం రాకేష్, ఎస్‌ఐలు మమత, శరత్ కుమార్ రెడ్డి ఉన్నారు.