Share News

చేతుల శుభ్రతతోనే ఆరోగ్యం

ABN , Publish Date - May 06 , 2026 | 12:28 AM

చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపూ ఆరోగ్యంగా ఉండవచ్చునని ఆర్‌బీఎ్‌సకే జిల్లా అధికారి డా.మహేశ్వర ప్రసాద్‌ అన్నారు. ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్బంగా కర్నూలు జీజీహెచ్‌లోని ఓపీ నెంబర్‌.43 జిల్లా సత్వర చికిత్స కేంద్రంలో అవగాహన సదస్సు జరిగింది

చేతుల శుభ్రతతోనే ఆరోగ్యం
v

కర్నూలు హాస్పిటల్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపూ ఆరోగ్యంగా ఉండవచ్చునని ఆర్‌బీఎ్‌సకే జిల్లా అధికారి డా.మహేశ్వర ప్రసాద్‌ అన్నారు. ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్బంగా కర్నూలు జీజీహెచ్‌లోని ఓపీ నెంబర్‌.43 జిల్లా సత్వర చికిత్స కేంద్రంలో అవగాహన సదస్సు జరిగింది. సబ్బుతో శుభ్రంగా చేతులను కడుక్కుంటే వ్యాధులను నివారించొచ్చన్నారు. తినడానికి ముందు, మలమూత్ర విసర్జన చేసిన తర్వాత ముక్కు చీదిన తర్వాత ఏదైనా తినుబండారాలను చేతిలో తీసుకునే ముందు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలన్నారు. ఎదిగిన పిల్లలు శానిటరీ ప్యాడ్స్‌ మార్చుకున్న తర్వాత ప్యాడ్స్‌ పడవేసిన తర్వాత జంతువులు వాటి వ్యర్థాలు తాకిన తర్వాత సబ్బుతో కడుక్కోవాలని సూచించారు. డైస్‌లో తల్లులు, పిల్లలతో ప్రతిజ్ఞ చేయించారు. డైస్‌ వైద్యనిపుణులు డా.సృజన రెడ్డి, డా.కీర్తి, మేనేజర్‌ ఇర్ఫాన్‌ ప్లోరోసిస్‌ కన్సల్టెంట్‌ సుధాకర్‌, డెంటల్‌ వైద్యులు డా.లక్ష్మిరెడ్డి, ప్రొజెక్షనిస్టు ఖలీల్‌ పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2026 | 12:28 AM