Share News

ఆరోగ్యానికి భద్రత హెచ్‌పీవీ టీకాలు

ABN , Publish Date - Mar 10 , 2026 | 11:16 PM

ఆరోగ్యానికి భద్రత హెచ్‌పీవీ(హ్యుమన్‌ పాపిల్లొమా వైరస్‌) టీకాలు అని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు.

ఆరోగ్యానికి భద్రత హెచ్‌పీవీ టీకాలు
బాలికకు టీకా పత్రాన్ని పంపిణీ చేస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల హాస్పిటల్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) : ఆరోగ్యానికి భద్రత హెచ్‌పీవీ(హ్యుమన్‌ పాపిల్లొమా వైరస్‌) టీకాలు అని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. మంగళవారం నంద్యాలలోని గాంధీనగర్‌ పట్టణ పీహెచ్‌సీలో నిర్వహించిన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణ వ్యాక్సినేషన్‌లో కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ 9 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలకు టీకా వేయించడం ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను పూర్తిగా నివారించొచ్చన్నారు. బాలికలందరికీ ఈ టీకా తప్పనిసరిగా అందేలా ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈవిషయంపై తల్లిదండ్రులకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు సమన్వయంతో పని చేసి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలు, మందులు ప్రతి రోగికి అందుతున్నాయో లేదో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సేకరించిన వివరాలను వెంటనే ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. డీఎంహెచ్‌వో డా. వెంకటరమణ, డీసీహెచ్‌ఎస్‌ డా.ఓ.లలిత, ఇమ్యునైజేషన్‌ అధికారి డా. సుదర్శన్‌, వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 10 , 2026 | 11:16 PM