ప్రకృతి పంటలతో ఆరోగ్యం పదిలం
ABN , Publish Date - Oct 17 , 2026 | 12:03 AM
: ప్రకృతి పంటలతో ఆరోగ్యం పదిలంగా ఉంటుందని ప్రభుత్వ వ్యవసాయ ప్రధాన సలహాదారు, రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి. విజయ్‌కుమార్ అన్నారు
ప్రకృతి వ్యవసాయ ప్రభుత్వ సలహాదారు విజయ్‌కుమార్
సంజామల, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి పంటలతో ఆరోగ్యం పదిలంగా ఉంటుందని ప్రభుత్వ వ్యవసాయ ప్రధాన సలహాదారు, రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి. విజయ్‌కుమార్ అన్నారు. సంజామల సమీపంలో సాగు చేసిన ప్రకృతి వ్యవసాయ పంటలను శుక్రవారం ఆయన పరిశీలించారు. సంజామలలోని సదానంద బీఆర్సీ శివరామయ్య దుకాణాన్ని సందర్శించి కిచెన్ గార్డెన్ కిట్లను రైతులకు అందజేశారు. కిచెన్ గార్డెన్ల పురోగతిని స్వయంగా ఆయన పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో మాట్లాడి పలు అంశాలపై సమగ్ర దిశా నిర్దేశం చేశారు. సచివాలయంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులతో సమావేశం నిర్వహించారు. పెండేకంటి కిరణ్‌కుమార్, డీఆర్డీఏ పీడీ వైవీ శ్రీధర్‌రెడ్డి, డీపీఎం శ్రీనివాసులు, కేవీకే శాస్త్రవేత్త ధనలక్ష్మి, జలీల్ అహ్మద్, అబ్దుల్ సలాం, ఏవొ ఉమాజ్యోతి, ఏపీఎం గురుస్వామి పాల్గొన్నారు.