ఆరోగ్య ఆంధ్రప్రదేశే లక్ష్యం
ABN , Publish Date - Sep 12 , 2026 | 11:57 PM
ప్రజలందరికీ మెరుగైన వైద్యసేవలందించి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. కర్నూలు జీజీహెచ్‌లో రూ.23.75 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్(సీసీబీ)ను వర్చువల్ విధానం ద్వారా కేంద్ర మంత్రి జేపీ నడ్డా, సీఎం చంద్రబాబు, వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ శనివారం ప్రారంభించారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, జేసీ నూరుల్ ఖమర్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.కే.వెంకటేశ్వర్లు, వార్డులను ప్రారంభించారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
జీజీహెచ్‌లో రూ.23.75కోట్లతో సీసీబీ ప్రారంభం
కర్నూలు హాస్పిటల్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రజలందరికీ మెరుగైన వైద్యసేవలందించి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. కర్నూలు జీజీహెచ్‌లో రూ.23.75 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్(సీసీబీ)ను వర్చువల్ విధానం ద్వారా కేంద్ర మంత్రి జేపీ నడ్డా, సీఎం చంద్రబాబు, వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ శనివారం ప్రారంభించారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, జేసీ నూరుల్ ఖమర్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.కే.వెంకటేశ్వర్లు, వార్డులను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కర్నూలు జీజీహెచ్‌కు ఏడు జిల్లాల నుంచి ప్రజలు చికిత్స కోసం వస్తుంటారని, అత్యవసర వైద్యం కోసం ఇబ్బందులు పడకుండా క్రిటికల్ కేర్ బ్లాక్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐసీయూ చికిత్సకు ఒక్కో బెడ్‌కు రోజుకు రూ.30 వేల నుంచి రూ.40వేల ఖర్చుయ్యే పరిస్థితుల్లో జీజీహెచ్‌లో పేదలకు అత్యాధునికంగా క్రిటికల్ కేర్ వైద్య సేవలు ఉచితంగా అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. జేసీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు, తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు, అత్యవసర వైద్య చికిత్సకు అవసరమయ్యే పరిస్థితుల్లో మెరుగైన సేవలు అందించేందుకు క్రిటికల్ కేర్ బ్లాక్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ క్రిటికల్ కేర్ బ్లాక్‌లో విషమంగా ఉన్న రోగులకు మెరుగైన సేవలందిస్తామన్నారు. సర్జరీ, వార్డులతో పాటు, ఐసీయూ, డయాలసిస్ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేశామన్నారు. కేఎంసీ ప్రిన్సిపాల్ డా.కే.చిట్టినరసమ్మ, ఏపీ ఎంఎ్‌సఐడీసీ ఎస్‌ఈ ఇంద్రాణి, డిప్యూటీ సూపరింటెండెంట్ డా.లక్ష్మీబాయి, వైస్ ప్రిన్సిపాల్ డా.శ్రీరాములు, సీఎ్‌సఆర్‌ఎంవో డా.పి.పద్మజ, ఆర్‌ఎంవో డా.వెంకటరమణ, క్రిటికల్ కేర్ బ్లాక్ నోడల్ ఆఫీసర్ డా.రామశివ నాయక్, నర్సింగ్ సూపరింటెండెంట్ సావిత్రీబాయి పాల్గొన్నారు.
కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి
బనగానపల్లె, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): కార్పొరేట్ స్థాయిలో బనగానపల్లె ఏరియా ప్రభుత్వ వైద్యశాలను అభివృద్ధి చేస్తున్నామని, పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి చెప్పారు. బనగానపల్లె ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు అదానీ ఫౌండేషన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్షిబిలిటీ నిధుల కింద అందించిన వివిధ వైద్య పరికరాలను శనివారం మంత్రి, ఎంపీ బైరెడ్డి శబరి, ఆర్డీవో నరేంద్రనాథరెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ ఉమాదేవితో కలిసి ప్రారంభించారు. మొదటి విడతగా రూ.1.57 కోట్లతో ఆప్తాలిక్ అలా్ట్రసౌండ్ స్కానర్, ఈఎన్‌టీ ఓవర్‌హెడ్ ప్రొజెక్టర్, టెలిస్కోప్, సిరంజ్ ఇన్ఫ్యూజన్ పంప్, ఎలకో్ట్ర సర్జికల్ యూనిట్, ఆర్థో అనస్థీషియా వర్క్‌స్టేషన్, ఈఎన్‌టీ డ్రిల్ సిస్టం తదితర పరికరాలను ప్రారంభించారు. మంత్రి బీసీ మాట్లాడుతూ.. మొత్తం రూ.3 కోట్లతో అదానీ ఫౌండేషన్ సహకారంతో వైద్య పరికరాలను సమకూరుస్తున్నట్లు తెలిపారు. రెండో విడతలో త్వరలో మరికొన్ని పరికరాలు రానున్నాయని తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో లేని పరికరాలను అదానీ గ్రూప్ సహకారంతో సమకూరుస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రికి నాణ్యమైన సేవలు అందిస్తున్న వైద్యుల బృందాన్ని అభినందించారు. ఆస్పత్రికి అవసరమైన కనీస సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వైద్యులు సేవాభావంతో పనిచేస్తున్నారని అందుకు ఓపీ పెరిగిందన్నారు. సూపరింటెండెంట్ మాట్లాడుతూ సేవాభావంతో పనిచేస్తున్నామని, అందుకే రోజూ ఓపీల సంఖ్య 800 వరకు ఉంటోందన్నారు. ఆర్థో డాక్టర్ రాఘవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో పరికరాలు అందించేలా కృషి చేయడంతో కేక్‌కట్ చేసి మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ మండల అధ్యక్షుడు పీవీ కుమార్‌రెడ్డి, బురానుద్దీన్, శ్రీనయ్య, నియాజ్‌హుస్సేన్, బత్తుల భాస్కర్‌రెడ్డి, చైర్మన్ మౌళీశ్వరరెడ్డి, కాశీంబాబు, సొసైటీ చైర్మన్ అబ్దుల్ అత్తార్ కలాం, ఇస్మాయిల్‌ఖాన్, అల్తా్‌ఫహుస్సేన్, శంకర్, భీముడు, తదితరులు పాల్గొన్నారు.