గాలివాన బీభత్సం
ABN , Publish Date - Jun 12 , 2026 | 11:34 PM
జిల్లాలో గురువారం అర్ధరాత్రి గాలి వాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులు ధాటికి అనేక వృక్షాలు నేలకొరిగాయి,
నేలకొరిగిన వృక్షాలు
అరటి, మామిడి పంటలకు తీవ్ర నష్టం
బండిఆత్మకూరు మండలంలో 49.2 ఎంఎం వర్షపాతం
నంద్యాల ఎడ్యుకేషన్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం అర్ధరాత్రి గాలి వాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులు ధాటికి అనేక వృక్షాలు నేలకొరిగాయి, బండిఆత్మకూరు, జూపాడుబంగ్లా, వెలుగోడు, పాములపాడు మండ లాల్లో గాలితో పాటు భారీ వర్షం కురిసింది. అరటి, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గర్భదశలో ఉన్న అరటి, కోత దశలో ఉన్న మామిడి పంటలు దెబ్బతి న్నాయి. సుమారు 580 ఎకరాల్లో అరటి, 120 ఎకరాల్లో మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. అత్యధికంగా బండిఆత్మకూరు మండలంలో 49.2ఎంఎం వర్షపాతం నమోదైంది. జూపాడుబంగ్లా 44.8, వెలుగోడు 28.6, పాములపాడు 21.8, పగిడ్యాల 16.4, గడివేముల 14.8, కొత్తపల్లె 14.6, ఆత్మకూరు 12.8, మహానంది 12.2. శ్రీశైలం 10.2, మిడ్తూరు 5.8, నంద్యాల పట్టణం 4.4, కోవెలకుంట్ల 1.6 ఎంఎం వర్షపాతం నమోదైంది.
మూడురోజుల పాటు వర్షాలు
జిల్లాలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో మరో మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరు ములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశ ముందని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది, వర్షంతో పాటు గంటకు 40నుంచి 60కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
కొలిమిగుండ్ల మండలంలో భారీ వర్షం
కొలిమిగుండ్ల : కొలిమిగుండ్ల మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం సాయంత్రం ఓ మోస్తరు నుండి భారీ వర్షం కురిసింది. మండలంలోని పెట్నికోట, కొండమీదపల్లె, గోర్విమానుపల్లె, మదనంతపురం, అంకిరెడ్డిపల్లె తదితర గ్రామాలలో శుక్రవారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెట్నికోట గ్రామంలో పై ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో మసీదు వంకలో వరద ప్రవహించింది.