Share News

కొలిక్కి రాలేదు?

ABN , Publish Date - Oct 16 , 2026 | 12:04 AM

మున్సిపాలిటీలో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చైర్‌పర్సన్‌ అభ్యర్థుల ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. ఆయా పార్టీలు అభ్యర్థుల పేరు ఖరారు చేయకపోవడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.

కొలిక్కి రాలేదు?

చైర్‌పర్సన్‌ అభ్యర్థులను ఎంపిక చేయని పార్టీలు

ఎవరికి వారుగా జాబితాలు పంపిన టీడీపీ నాయకులు

అమోయమంలో ఆశావహులు

నందికొట్కూరు అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీలో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చైర్‌పర్సన్‌ అభ్యర్థుల ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. ఆయా పార్టీలు అభ్యర్థుల పేరు ఖరారు చేయకపోవడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. వైసీపీ కార్యాలయంలో గురువారం ఉదయం బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో చైర్‌పర్సన్‌ ఎంపికపై చర్యలు జరిగాయి. మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన ఓమహి ళను ఎంపిక చేసేందుకు కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఆ కుటుంబ సభ్యులు పోటీ చేసేందుకు అఇష్టంగా ఉండడంతో అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను బైరెడ్డి రంగంలోకి దింపారు. వారు చైర్‌పర్సన్‌గా బరిలో దిగేందుకు ఒప్పుకున్న ట్లు తెలుస్తోంది. టీడీపీ చైౖర్‌పర్సన్‌ అభ్యర్థి ఎంపిక పూర్తికాగానే వైసీపీ అభ్యర్థిని ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మాండ్ర, జయసూర్యల ఆధ్వర్యలో..

టీడీపీ నాయకుడు మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్త జయసూర్యల ఆధ్వర్యంలో చైర్‌పర్సన్‌ అభ్యర్థి ఎంపికపై అల్లూరు గ్రామంలో గురువారం చర్చలు జరిగాయి. మొల్లా జాకీర్‌, లాయర్‌ జాకీర్‌ మధ్య పోటీ ఏర్పడింది. నలుగురి పేర్లపై ఐవీఆర్‌ఎస్‌ సర్వేను పార్టీ చేపట్టింది. ఆ సర్వే ప్రకారం పార్టీకి ఆ నలుగురి పేర్లను అధిష్ఠానానికి పంపినట్లు సమాచారం. అక్కడి నుంచి ఎవరి పేరును అధిష్ఠానం ప్ర తిపాదించినా అందరూ కలిసి పని చేయాలని నాయకులకు సూచిం చినట్లు తెలుస్తోంది. లాయర్‌ జాకీర్‌ సతీమణి సబీరున్నీసా పేరు ఖరారైందని పట్టణంలో టీడీపీ నాయకులు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు.

ఎంపీ అనుచరుల జాబితా..

మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి నివాసంలో నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి పట్టణ ముఖ్య నాయకులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఐదుగురు చైర్‌పర్సన్‌, 32 కౌన్సిలర్ల సీట్లను ఆశిస్తున్న వారి జాబితాను సిద్ధం చేసి అధిష్ఠానానికి పంపినట్లు తెలుస్తోంది. ఇలా ఎవరికి వారుగా ఆశావహుల జాబితాను అధిష్ఠానానికి పంపడంతో ఆశావహులు అయోమయానికి గురవుతున్నారు.

Updated Date - Oct 16 , 2026 | 12:04 AM