బాలలను వేధిస్తే కఠిన శిక్షలు
ABN , Publish Date - May 07 , 2026 | 11:06 PM
బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి అన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి
కర్నూలు లీగల్, మే 7 (ఆంధ్రజ్యోతి): బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి అన్నారు. గురువారం స్థానిక హోఫ్ ఆఫ్ హోంలో పోక్సో చట్టంపై బాలలనుద్దేశించి ఆయన మాట్లాడారు. జాగృతి పథం-2025 కింద సురక్షిత బచ్‌ఫన్ - సురక్షిత భవిష్యపై బాలలకు ఆయన అవగాహన కల్పించారు. 18 సంవత్సరాల లోపు వయస్సున్న బాలలపై లైంగిక వేధింపులు జరగకుండా ఈ పోక్సో చట్టాన్ని తీసుకు వచ్చారన్నారు. పోక్సో కేసులను త్వరగా పరిష్కరించేందుకు కర్నూలులో ప్రత్యేక కోర్టు ఉందన్నారు. బాలలకు ఏదైనా సమస్య వస్తే నిర్భయంగా తల్లిదండ్రులకు, పాఠశాలల ఉపాధ్యాయులకు, పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు చేయడానికి భయపడిన వారికి టోల్ ఫ్రీ నెంబర్.15100కు కాల్ చేస్తే వారి సమస్యలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పరిష్కరిస్తుందన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద, జాగృతి యూనిట్ సభ్యుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.