దివ్యాంగుల ఆనందమే లక్ష్యం
ABN , Publish Date - Jun 16 , 2026 | 12:22 AM
దివ్యాంగుల ఆనందమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోదని, జిల్లాలో ప్రప్రథమంగా సూమారు రూ.4 కోట్ల విలువచేసే ఆసరా పరికరాలను మూడు వేల మంది దివ్యాంగులకు అందజేసినట్లు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి పేర్కొన్నారు.
3వేల మందికి ఆసరా పరికరాలు
నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి
నంద్యాల రూరల్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల ఆనందమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోదని, జిల్లాలో ప్రప్రథమంగా సూమారు రూ.4 కోట్ల విలువచేసే ఆసరా పరికరాలను మూడు వేల మంది దివ్యాంగులకు అందజేసినట్లు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి పేర్కొన్నారు. సోమవారం టెక్కె మార్కెట్ యార్డులో నంద్యాల జిల్లాకు చెందిన దివ్యాంగులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో, ఎంపీ సహకారంతో కలెక్టర్ రాజకుమారితో కలిసి ఆమె ఆసరా పరికరాలను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వికలాంగుల కళ్లలో ఆనందం చూడడమే ప్రభుత్వ ద్యేయమన్నారు. రాష్ట్రంలో మొదటిసారి నంద్యాల జిల్లా పరిధిలోని మూడు వేల మంది దివ్యాంగులు, వయోవృద్ధ్దులకు, వీల్‌చైర్లు, ట్రైసైకిళ్లు, బ్యాటరీ సైకిళ్లు, వినికిడి యంత్రాలు అందజేయడం గర్వకారణమన్నారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ సమాజంలో విభిన్న ప్రతిభావంతులు, దివ్యాంగులు స్వయం సమృద్ధితో జీవించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మెన్ నారాయణస్వామి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్, ఉమ్మడి క ర్నూల్ జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పాతిమా, నంద్యాల ఆర్డీవో చల్లా విశ్వనాఽథ్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, నంద్యాల మార్కెట్ యార్డు చైర్మెన్ గుంటుపల్లి హరిబాబు, మార్క్‌ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ తులసిరెడ్డి, సెంట్రల్ పుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.