Share News

భక్తిశ్రద్ధలతో హనుమజ్జయంతి

ABN , Publish Date - May 13 , 2026 | 12:16 AM

నగరంలో హనుమజ్జయంతి వేడుకలు మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో హనుమజ్జయంతి
జగన్నాథగట్టుపై పూజలు చేస్తున్న ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు

కర్నూలు కల్చరల్‌, మే 12(ఆంధ్రజ్యోతి): నగరంలో హనుమజ్జయంతి వేడుకలు మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జగన్నాథ గట్టుపై వెలసిన 62 అడుగుల ఎత్తుగల ఆంజనేయస్వామి ఆలయంలో చుట్టూ పక్కల గ్రామాలకు చెందిన భక్తులు తరలివచ్చి పూజలు చేశారు. ఉదయం వేకువ జాము నుంచీ స్వామి వారికి అభిషేక అర్చనలు, ఆకు పూజలు నిర్వహించారు. మహిళలు సామూహిక హనుమాన చాలీసా పారాయణలు చేశారు. కార్యక్రమంలో జగన్నాథ గట్టు అభివృద్థి కమిటీ ప్రతినిధులు నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఇ.మల్లి కార్జున రెడ్డి, వాసుదేవ య్య, నాగరాజు, ఆదిత్య స్కూల్‌ కరస్పాండెంట్‌ బి. వాసుదేవయ్య, కల్కి మురళి, కె. క్రిష్ణన్న ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ ఏర్పాటు చేశారు. కర్నూలు కార్తీక దీపోత్సవ కమిటీ అధ్యక్షురాలు ఇ. పద్మావతి ఆధ్వర్యంలో మహిళలు సామూహిక హనుమాన చాలీసా పారాయణం నిర్వహించారు. బళ్లారి చౌరస్తాలోని వీరాంజనేయ స్వామి దేవస్థానంలో వేకువ జాము నుంచి స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ఆకుపూజలు చేప ట్టారు. మహిళలు హనుమాన చాలీసా పారాయణం చేశారు. పాతనగరంలోని లలితాపీఠంలో సీతారాముల కల్యాణోత్సవ కమిటీ, లలితాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో పీఠాధిపతి గురు మేడా సుబ్ర హ్మణ్యం స్వామి పర్యవేక్షణలో లోక కల్యాణార్థం సామూహిక హనుమాన చాలీసా పారాయణం చేశారు. అనంతరం స్వామివారికి పల్లకీ సేవ, రథోత్సవం, లలితా సుందరేశ్వర స్వామివారికి కల్యాణ వేడుకలను వేదపండితుడు మామిళ్లపల్లి రాజేశ శర్మ నేతృత్వంలో నిర్వహించారు. రామ్‌నగర్‌లోని నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీలో హనుమాన ఆలయంలో సాయంత్రం ఆంజనేయస్వామి వారి ఉత్సవ మూర్తిని పల్లకిపై ఆసీనింపజేసి, స్థానిక వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్లు వజ్రాల గోవిందరెడ్డి, వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు. హరిశ్చంద్ర షరీననగర్‌లోగల సద్గురు త్యాగరాజ సీతారా మాల యంలో ప్రధానార్చకుడు మాళిగా భానుప్రకాశ ఆధ్వర్యంలో సామూహిక హనుమాన చాలీసా పారాయణం చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ఉదయ్‌ప్రసాద్‌, జంపాల నవీన, రవి, అశోక్‌ పాల్గొన్నారు. పాతనగరంలోని శ్రీరామాలయంలో, హనుమాన ఆలయంలో, కుమ్మరి వీధిలోని హనుమాన ఆలయంలో, వనటౌన, అశోక్‌నగర్‌లోని ఆంజనేయస్వామి ఆలయాల్లో హనుమజ్జయంతిని నిర్వహించారు.

కోడుమూరు రూరల్‌: మండలంలోని వివిధ గ్రామాల్లో హనుమజ్జయంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మండలం లోని వెంక టగిరి గ్రామంలో గిడ్డాంజనేయస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. ఈసందర్భంగా ఆలయంలో అభిషేకాలు, ఆకుపూజ, అర్చనలు జరిపిం చారు. సాయంత్రం రథంపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చి ఎదురు మండపం వరకు రథం లాగి తిరిగి రథశాలకు చేర్చారు. కోట్ల హరిచక్ర పాణిరెడ్డి, కోట్ల హర్షవర్థనరెడ్డి వేర్వేరుగా దర్శించుకున్నారు. అలాగే వర్కూరులో హనుమజ్జయంతిని పురస్కరించుకుని పంచా మృతాభిషేకం, అన్నదానం జరిపించారు. రాష్ట్రస్థాయి భజన పోటీలు ఏర్పాటు చేశారు. పోటికి వివిధ చోట్ల నుంచి సుమారు 21 భజన మండళ్లు పాల్గొన్నారు. విజేతలకు దాతలు నగదు బహుమతులు అందజేశారు.

ఓర్వకల్లు: మండలంలోని ఓర్వకల్లు కన్నమడకల, పూడిచెర్ల, గుట్టపాడు, నన్నూరు, ఉయ్యాలవాడ, లొద్దిపల్లె, హుశేనాపురం, సోమయా జులపల్లె, కొమ్ముచెరువు, కాల్వ, భైరాపురం తదితర గ్రామాల్లో హనుమ జ్జయంతి సందర్భంగా మంగళవారం ఆలయాల్లో ఆంజనే యస్వామికి ఆకుపూజలు నిర్వహించారు. ఓర్వకల్లు ఆంజనేయస్వామి ఆలయంలో తహసీల్దార్‌ విద్యాసాగర్‌, ఎంపీడీవో నాగఅనసూయ ప్రత్యేక పూజలు చేశారు. చెన్నకేశవస్వామి భజన బృందం పాడిన భక్తి గేయాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఆయా గ్రామాల్లో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

గూడూరు: హనుమాన సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం గూడూరులోని స్వయంభు అంజనేయ స్వామి ఆలయంలో స్వామి వారికి ఆకుపూజ, అభిషేకం, మహా మంగళహారతి తదితర పూజలు నిర్వహిం చారు. స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. సాయంత్రం హనుమాన శోభాయాత్ర అశేష భక్త జనుల మధ్య కనుల పండువగా సాగింది. శోభాయాత్రలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటం అలరిం చాయి. కార్యక్రమంలో హనుమాన సేవా సమితి సభ్యులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2026 | 12:16 AM