Share News

జీడీపీకి నిలిచిన హంద్రీ నీవా నీరు

ABN , Publish Date - Mar 19 , 2026 | 11:44 PM

గాజులదిన్నె ప్రాజెక్టుకు రెండు రోజులుగా హంద్రీనీవా నీళ్లు నిలిచిపోయాయి.

జీడీపీకి నిలిచిన హంద్రీ నీవా నీరు
గాజులదిన్నె ప్రాజెక్టు

1 నుంచి తాగునీటి పథకాలకు మాత్రమే విడుదల

గోనెగండ్ల, మార్చి 19(ఆంధ్రజ్యోతి): గాజులదిన్నె ప్రాజెక్టుకు రెండు రోజులుగా హంద్రీనీవా నీళ్లు నిలిచిపోయాయి. 9నెలల నుంచి హంద్రీనీవా(శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌) నుంచి రోజుకు 200 నుంచి 160 క్యూసెక్కుల వరకు నీరు చేరేవి. మండుతున్న ఎండల కారణంగా హంద్రీనీవా ప్రాజెక్టు నీటి మళ్లింపు పంపులను అక్కడి అధికారులు నిలిపి వేశారు. ప్రస్తుతం జీడీపీలో 2.4 టీఎంసీ(లైవ్‌) 3.1 టీఎంసీ (గ్రాస్‌) నీరు ఉంది.

దాదాపు 1 టీఎంసీ నీరు వృథా

నిబంధనల ప్రకారం దాదాపు 3టీఎంసీల నీరు గాజులదిన్నె ప్రాజెక్టుకు హంద్రీనీవా అధికారులు విడుదల చేశారు. మధ్యలో దాదాపు 1 టీఎంసీ నీరు వృథా అయినట్లు తెలుస్తుంది. జీడీపీకి లోకి 2 టీఎంసీ నీరు నికరంగా చేరివుంటుదని అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి జీడీపీ నీరు కేవలం తాగునీటి పథకాలకు మాత్రమే విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. బండగట్టు, క్రిష్టగిరి, డోన్‌ తాగునీటి పథకాలకు, అవసరం సమయంలో కోడుమూరు, గుడూరు, బెళగల్‌, ప్రాంతాలకు నీటిని విడుదల చే సేందుకు సిద్ధంగా ఉన్నట్లు అఽఽధికారులు తెలుపుతున్నారు.

రోజుకు 30 క్యూసెక్కుల నీరు అవిరి: గాజులదిన్నె ప్రాజెక్టులోని నిలువ నీటి నుంచి రోజుకు 30క్యూసెక్కుల నీరు అవిరి రూపంలో వెళ్తుంది. ఎండలు ముదిరితే అదనంగా మరో 10 క్యూసెక్కుల నీరు అవి రి అవు తుందని తెలుస్తుంది. ఈలెక్క ప్రకారం ఈ ఎండాకాలం ముగి సే వరకు తాగునీటి పథకా లకు ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నట్లు తెలుస్తుంది.

Updated Date - Mar 19 , 2026 | 11:44 PM