Share News

జయహో.. గురు రాఘవేంద్రా.. విజయహో..

ABN , Publish Date - Aug 29 , 2026 | 11:42 PM

జయహో గురు రాఘవేంద్రా.. విజయహో అంటూ దేశ నలుమూలల నుంచి అశేష భక్తజనవాహిని తరలివచ్చి మంత్రాలయంలో తరించారు. రాఘవేంద్రస్వామి 355వ ఆరాధనోత్సవాల్లో ముఖ్యమైన పూర్వారాధనోత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు

జయహో.. గురు రాఘవేంద్రా.. విజయహో..
పుష్కరిణిలో తెప్పోత్సంపై ఊరేగుతున్న ప్రహ్లాదరాయలు

వైభవంగా రాఘవేంద్రుల పూర్వారాధన

ప్రహ్లాదరాయల అలంకరణలో బృందావనం

సింహ వాహనంపై దర్శనమిచ్చిన ప్రహ్లాదరాయలు

శ్రీరంగం క్షేత్రం నుంచి పట్టువస్త్రాల సమర్పణ

మంత్రాలయం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): జయహో గురు రాఘవేంద్రా.. విజయహో అంటూ దేశ నలుమూలల నుంచి అశేష భక్తజనవాహిని తరలివచ్చి మంత్రాలయంలో తరించారు. రాఘవేంద్రస్వామి 355వ ఆరాధనోత్సవాల్లో ముఖ్యమైన పూర్వారాధనోత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాఘవేంద్రస్వామికి విశేష పూజలు చేసి బృందావనాన్ని ప్రహ్లాదరాయల రూపంలో అలంకరణ చేసిన దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. బంగారు పల్లకిపై రాఘవేంద్రులను ఘనంగా ఊరేగించగా ఈదృశ్యాలను చూసి భక్తులు ఆనంద పరవశంతో తరించారు. తమిళనా డులోని శ్రీరంగంలోని రంగనాథస్వామి దేవస్థానం నుంచి ప్రధాన అర్చకులు అధికా రికంగా స్వామివారికి పట్టువస్త్రాలు తీసుకొచ్చారు. వీరికి శ్రీమఠం అధికారులు మహా ముఖద్వారం నుంచి ఊరేగింపుతో తీసుకొచ్చి మూల బృందావనం ముందు ఉంచి పూజలు చేసి అనంతరం పీఠాధిపతికి సన్మానించారు. సింహవాహనుడైన ప్రహ్లాద రాయుడు చెక్క పల్లకిలో ఊరేగించిన అనంతరం ఊంజల సేవ చేసి పీఠాధిపతి హారతులిచ్చారు. భక్తుల రద్దీతో మంత్రాలయం మఠం ప్రాంగణం, మధ్వమార్గ్‌ కారిడార్‌ ప్రధాన రహదా రులు భక్తులతో కిటకిటలాడాయి. అంతకుముందు పూర్ణబోధ పూజా మందిరంలో మూలరాములు, జయరాములు, దిగ్విజయరాములకు కనకాభిషేకం చేశారు. పరిమళ పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత విద్వాన్‌ రాజా ఎస్‌ గిరిరాజాచార్‌, సుజయీంద్రాచార్‌, గౌతమాచార్‌, కృష్ణ కౌశిక్‌, శ్రీషా జోయిష్‌, రాజా పీ అప్రమేయాచార్‌, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీని వాసరావు, వెంకటేష్‌ జోషి, సురేష్‌ కోనాపూర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహ మూర్తి, శ్రీపతిఆచార్‌, పూజారి వ్యాస రాజాచార్‌, సూపరింటెండెంట్‌ అనంతపురాణిక్‌, రాఘవేంద్ర రావు, రవి కులకర్ణి, విజయేంద్రాచార్‌, జయతీర్థాచార్‌, ఏఈ బద్రినాథ్‌, ద్వారపాలక అనంతస్వామి, ప్రకా్‌షఆచార్‌, డీఎం ఆనందరావు, జేపీ స్వామి, సెక్యూరిటీ ఇన్‌చార్జి రమేష్‌ పాల్గొన్నారు.

ప్రముఖులకు అవార్డుల ప్రదానం

మంత్రాలయం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామి 355వ ఉత్సవాల్లో మూడో రోజు యోగీంధ్ర కళామండపంలో శనివారం రాత్రి ప్రముఖులకు పీఠా ధిపతి సుబుధేంద్రతీర్థులు అత్యంత గౌరవప్రధమైన రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి-2026 అవార్డులను ప్రదానం చేశారు. మంత్రాలయంకు చెందిన గురుసార్వభౌమ సంస్కృత పాఠ శాల ప్రిన్సిపాల్‌ విద్వాన్‌ డాక్టర్‌ ఎన్‌ వాదిరాజాచార్‌ , తమిళనాడులోని తాంజవూరుకు చెందిన శస్త్ర యూనివర్సిటీ వీసీ ఎస్‌ వైద్యసుబ్రమణ్యంకు అవార్డులను అందజేశారు. ప్రశంసాపత్రం, వెండి తట్ట, నగదు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, శేషవస్త్రం, గంధపుచెక్కతో తయారుచేసిన పూలమాల, మంత్రాక్షితలు, ఫల, పుష్ప, పరిమళ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. కార్యక్రమం లో మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, సురే్‌షకోణాపూర్‌, శ్రీపతి ఆచా ర్‌, ఐపీ నరసింహమూర్తి, గౌతమ్‌ఆచార్‌, సుజయీంద్రఆచార్‌, నార్త్‌స్టేట్‌ శ్రీమఠం విచారణకర్త శ్రీనివాసకస్బే, కర్ణాటక పీఆర్‌వో సంజీవ్‌కులకర్ణి, విజయేంద్రాచార్‌, అనంతపురాణిక్‌, రాఘవేం ద్రరావు, ద్వారపాలక అనంతస్వామి, ప్రకా్‌షఆచార్‌, రాజా పి అప్రమేయాచార్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 29 , 2026 | 11:42 PM