జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ABN , Publish Date - Oct 09 , 2026 | 11:07 PM
ఓటర్ల తొలగింపునకు కారకులైన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వామపక్ష విద్యార్థి యువజన సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల డిమాండ్
కర్నూలు ఎడ్యుకేషన్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల తొలగింపునకు కారకులైన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వామపక్ష విద్యార్థి యువజన సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. డీవైఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేష్, ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ఏఐఎ్‌సఎఫ్ జిల్లా కార్యదర్శి రంగస్వామి, డీవైఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, ఐసా రాష్ట్ర కార్యదర్శి నాగార్జున, పీడీఎ్‌సయూ రాష్ట్ర నాయకుడు రమణ మా ట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఓటు హక్కు పరిరక్షణ కోసం జెన్-జీ అపూర్వ పోరాటానికి సంపూర్ణ మద్దతుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇది ఎన్నికల ప్రక్రియనే మారుస్తూ పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న ఏకపక్ష విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం అని పేర్కొన్నారు. . ఈ కార్యక్రమంలో ఏఐఎ్‌సడీఎస్ రాష్ట్ర నాయకులు కుమార్, అభిషేక్, అశోక్, వీరాంజనేయులు, అర్జున్, బీసన్న, తదితరులు పాల్గొన్నారు.