Share News

జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలి

ABN , Publish Date - Oct 02 , 2026 | 11:23 PM

భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని వామపక్షాల నాయకులు డిమాండ్‌ చేశారు.

జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలి
జిల్లా పరిషత్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వస్తున్న వామపక్షాల నాయకులు

వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన

కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని వామపక్షాల నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం జిల్లా పరిషత్‌ నుంచి సీపీఎం, సీపీఐ, ఎ్‌సయూసీఐ, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ, సీపీఐ ఎంఎల్‌ మాస్‌లైన్‌ తదితర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ ని ర్వహించారు. కలెక్టరేట్‌ ఎదుట ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీఐ, సీపీఎం నగర కార్యదర్శులు రామక్రిష్ణారెడ్డి, టి.రాముడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో సీపీఐ జిల్లా రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు రామాంజనేయులు మా ట్లాడుతూ ప్రధాన ఎన్నికల అదిధికారి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి 13కోట్ల మంది ఓటు హక్కు రద్దు చేశారని ఆరోపించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు కే. ప్రభాకర్‌రెడ్డి మా ట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను జేబు సంస్థగా మార్చు కుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌యూసీఐ జిల్లా కార్యదర్శి హరీ్‌షకుమార్‌, సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2026 | 11:23 PM