Share News

భయం గుప్పిట్లో గుమ్మనూరు

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:56 PM

భయం గుప్పిట్లో గుమ్మనూరు

భయం గుప్పిట్లో గుమ్మనూరు
గుమ్మనూరు గ్రామంలో పోలీసు పికెట్‌

గ్రామంలో పోలీసు పికెట్‌

చిప్పగిరి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా గురువారం చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో కూటమి, వైసీపీ నాయకుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఆరుగురికిపైగా గాయపడ్డారు. ఈ ఘర్షణలో గుంతకల్లు ఎమ్మెల్యే, గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణతో పాటు పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘర్షణపై బోయ శ్రీకాంత్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీజేపీ నేత గుమ్మనూరు నారాయణతో పాటు మరో 19 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక పికెట్‌ ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ నరసింహులు తెలిపారు.

Updated Date - Nov 06 , 2026 | 11:56 PM