Share News

విద్యార్థినుల భవిష్యత్తుకు దిశానిర్దేశం

ABN , Publish Date - Nov 12 , 2026 | 12:02 AM

నాలుగేళ్ల విద్యా ప్రయాణానికి ముగింపు పలుకుతూ కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న బీఎస్సీ న ర్సింగ్‌ నాల్గవ సంవత్సరం విద్యార్థులకు కర్నూలు ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీలో ఘనంగా వీడ్కోల వేడుకలు నిర్వహించారు.

విద్యార్థినుల భవిష్యత్తుకు దిశానిర్దేశం
వీడ్కోలు కార్యక్రమంలో నర్సింగ్‌ విద్యార్థినులు

ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీలో ఉత్సాహంగా వీడ్కోలు వేడుక

కర్నూలు హాస్పిటల్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): నాలుగేళ్ల విద్యా ప్రయాణానికి ముగింపు పలుకుతూ కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న బీఎస్సీ న ర్సింగ్‌ నాల్గవ సంవత్సరం విద్యార్థులకు కర్నూలు ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీలో ఘనంగా వీడ్కోల వేడుకలు నిర్వహించారు. ముందుగా మూడో సంవత్సరం విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకున్న నాలుగో సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు పలికారు. ఈ సందర్బంగా నర్సింగ్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ ఆర్‌.పద్మావతి మాట్లాడుతూ రోగుల పట్ల మానవత్వం, సేవాభావం, అంకితభావంతో పని చేస్తూ కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం నర్సింగ్‌ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు ఆకట్టుకున్నాయి.

Updated Date - Nov 12 , 2026 | 12:02 AM