Share News

ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయండి

ABN , Publish Date - May 26 , 2026 | 12:56 AM

ఈ ఏడాది ఖరీ్‌ఫలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశముందని, రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని డాక్టర్‌ సహదేవరెడ్డి, ప్రిన్సిపల్‌ సైంటిస్టు ఆర్‌ఏఆర్‌ఎస్‌ మార్తేరు అన్నారు.

ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయండి
కోటకొండలో మాట్లాడుతున్న శాస్త్రవేత్త సహదేవరెడ్డి

రైతులకు సూచించిన శాస్త్రవేత్తలు

రుద్రవరం, మే 25 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఖరీ్‌ఫలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశముందని, రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని డాక్టర్‌ సహదేవరెడ్డి, ప్రిన్సిపల్‌ సైంటిస్టు ఆర్‌ఏఆర్‌ఎస్‌ మార్తేరు అన్నారు. సోమవారం కోటకొండ గ్రామంలో రైతులకు పంటలు సాగుపై అవగాహన కల్పించారు. తక్కువ కాల పరిమితి, బెట్టను తట్టుకోగల పంటలు అపరాలు, పప్పుదినుసులు సాగు చేయాలన్నారు. సాగుకు ముందు జీలుగలు, జనుము, పిల్లిపెసర, పీఎంబిడి్‌సకిట్లు, భూమిలో వెదజల్లి మొక్కలు వచ్చాక కలియదున్నితే భూసారం పెరుగుతుందని, ఎరువుల వాడకం తగ్గించి తగు మోతాదులో వాడాలన్నారు. శాస్త్రవేత్త తేజేశ్వరరావు మాట్లాడుతూ రైతులు సంఘటితంగా వ్యవసాయం చేస్తే మార్కెట్‌ ధరలను సొంతంగా నిర్వహించుకోవచ్చన్నారు. ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ మంజునాథ, డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ అసిస్టెంటు డైరెక్టరు చెన్నయ్య, ఏవో సుమతి, వెంకటేశ్వర్‌రెడ్డి, ఏఈవో రాజు, వీఐఏ ఉమాదేవి, గ్రామ పెద్దలు వెంకటపతి, రాజు, కోటకొండకు చెందిన రైతు కుమ్మరి సుభాష్‌ పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2026 | 12:56 AM