Share News

జలధారతో భూగర్భ జలాలు

ABN , Publish Date - May 12 , 2026 | 11:18 PM

జిల్లాలో జలధార - జలహారతి కార్యక్రమం ద్వారా భూగర్భజలాలను పెంచడం, చెరువులకు అనుసంధానం చేసి సాగునీరు అందించడం తమ లక్ష్యమని కలెక్టర్‌ డా.ఏ. సిరి అన్నారు.

జలధారతో భూగర్భ జలాలు
పూడికతీత పనులను ప్రారంభిస్తున్న కలెక్టర్‌

పూడికతీత పనులతో కూలీలకు ఉపాధి

కలెక్టర్‌ డా. సిరి

ఓర్వకల్లు, మే 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జలధార - జలహారతి కార్యక్రమం ద్వారా భూగర్భజలాలను పెంచడం, చెరువులకు అనుసంధానం చేసి సాగునీరు అందించడం తమ లక్ష్యమని కలెక్టర్‌ డా.ఏ. సిరి అన్నారు. మంగళవారం ఓర్వకల్లు మండలంలోని సోమయాజులపల్లె గ్రామంలో జలధార - జలహారతి వంద రోజుల కార్యక్రమంలో భాగంగా చెరువులో పూడికతీత పనులను కలెక్టర్‌ ప్రారంభించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న జనగణన ప్రక్రియను పర్యవేక్షించారు. ఆ తర్వాత కాల్వబుగ్గ గ్రామంలోని నర్సరీని సందర్శించి మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సిరి మాట్లాడుతూ పూడికతీత ద్వారా శ్రామికులకు ఉపాధి పనులు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని డ్వామా అధికారులను ఆదేశించారు. చెక్‌డ్యామ్‌ల మరమ్మతులకు సంబంధించిన అంచనాకు సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లా వ్యాప్తంగా జలహారతి కార్యక్రమంలో భాగంగా 4,100 పనులు గుర్తించామని, అందులో 2,100 పనులకు మంజూరు చేశామన్నారు. ఇప్పటికే 1,100 పనులు గ్రౌండింగ్‌ దశకు చేరుకున్నాయని, మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. అనంతరం సోమయాజులపల్లె గ్రామంలో జరుగుతున్న జనగణన ప్రక్రియను పరిశీలించారు. ఇన్‌చార్జి కర్నూలు ఆర్డీవో అనూరాధ, డ్వామా పీడీ నరసింహారెడ్డి, ఏపీడీ పద్మ, తహసీల్దార్‌ విద్యాసాగర్‌, ఎంపీడీవో నాగఅనుసూయ, ఏపీవో మద్దేశ్వరమ్మ, ప్లాంటేషన్‌ మేనేజర్‌ నందకిషోర్‌, గ్రామ నాయకులు కాకి దేవేంద్ర, శ్రీరామ శ్రీనివాసరెడ్డి, ఆకుల మహేష్‌, నాగమ ల్లేష్‌, రామమద్దిలేటి, భైరీ హనుమంతరావు, వివిధ శాఖల అధికా రులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2026 | 11:18 PM