Share News

వేరుశనగ క్వింటా రూ.9,200

ABN , Publish Date - Aug 18 , 2026 | 11:01 PM

ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మంగళవారం వేరుశనగ క్వింటా గరిష్ఠ ధర రూ. 9,200, మధ్యస్థం రూ.7,800, కనిష్ఠం రూ.3,481 పలికింది.

వేరుశనగ క్వింటా రూ.9,200
వ్యవసాయ మార్కెట్‌కు అమ్మకానికి వచ్చిన వేరుశనగ

ఎమ్మిగనూరు, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మంగళవారం వేరుశనగ క్వింటా గరిష్ఠ ధర రూ. 9,200, మధ్యస్థం రూ.7,800, కనిష్ఠం రూ.3,481 పలికింది. మార్కెట్‌ యార్డుకు ఎమ్మిగనూరు చట్టుపక్కల ప్రాంతాలు, పాటు మంత్రాలయం, పత్తికొండ, నియోజకవర్గాలతో పాటు తెలంగాణ, కర్ణాటక ప్రాంతాలనుంచి 138 మంది రైతులు 4,910 బస్తాలు వేరుశనగ, ఒక రైతు ఐదు బస్తాల ఆముదాలు విక్రయానికి తీసుకొచ్చారు. గత వారం నుంచి వేరుశనగ పంటకు మార్కెట్‌ యార్డులో మంచి ధరలు లబిస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఆశించిన స్థాయిలో ధరలు వస్తుండటంతో మన జిల్లా తో పాటు పక్క జిల్లా అనంతపురం, పక్క రాష్ర్టాలు కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలనుంచి రైతులు వేరుశనగను విక్రయించేందుకు ఎమ్మిగనూరు మార్కెట్‌ యార్డుకు వస్తున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా మార్కెట్‌ పంట ఉత్పత్తులతో కళకళలాడుతోంది.

Updated Date - Aug 18 , 2026 | 11:01 PM