Share News

వేరుశనగ క్వింటం రూ. 8,500

ABN , Publish Date - Jul 17 , 2026 | 11:20 PM

ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌కు పంట ఉత్పత్తులు రాక ఊపందుకున్నాయి. శుక్రవారం రైతులు పెద్ద ఎత్తున వేరుశనగను విక్రయానికి తీసుకొచ్చారు.

వేరుశనగ క్వింటం రూ. 8,500

పంట ఉత్పత్తులతో కళకళలాడిన ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌

ఎమ్మిగనూరు, జూలై 17(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌కు పంట ఉత్పత్తులు రాక ఊపందుకున్నాయి. శుక్రవారం రైతులు పెద్ద ఎత్తున వేరుశనగను విక్రయానికి తీసుకొచ్చారు. మార్కెట్‌కు 375మంది రైతులు 15,517 బసాలు(4655క్వింటాళ్లు) వేరుశనగ అమ్మకానికి తీసుకొచ్చారు. దీంతో వ్యవయసాయ మార్కెట్‌ వేరుశనగ రాశులతో కళకళలాడింది. ఉదయం మేఘావృతం కావడంతో వర్షం వస్తుందేమోనని రైతులు ఆరు బయట దింపేందుకు ఇబ్బంది పడ్డారు. షెడ్లకింద స్థలం లేకపోవటంతో చాలా సేపు ట్రాక్టర్లు, ఇతర వాహానాల్లోనే బస్తాలను పెట్టుకొని ఉండాల్సిన పరస్థితి ఏర్పడింది. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. చివరకు మార్కెట్‌లో అక్కడ అక్కడ షెడ్లకింద కొంతమంది రైతులు బస్తాలను దింపుకోగా మరి కొంతమంది తప్పని పరస్థితుల్లో ఆరుబయట ప్లాట్‌ఫారంపై దించి విక్రయానికి ఉంచారు. కాగా వేరుశనగ శుక్రవారం క్వింటం గరిష్ఠ ధర రూ.8,500, మధ్యస్తం రూ.6,350, కనిష్ఠం రూ. 4,200 పలికింది. ఆముదాలు రెండు బస్తాలు రాగా క్వింటం రూ. 5,510 పలికింది. గత కొన్ని రోజులుగా మార్కెట్‌కు అంతంత మాత్రంగానే పంట ఉత్పత్తులు వస్తున్నాయి. అయితే తాజాగా 15,517బస్తాలు వేరుశనగ, 2 ఆముదం బస్తాలు విక్రయానికి రావటంతో మార్కెట్‌ రైతులు, వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లు, వేమెన్లు, హమాలీలతో కళకళలాడింది.

Updated Date - Jul 17 , 2026 | 11:20 PM