సిరులు కురిపించిన వేరుశనగ
ABN , Publish Date - Mar 22 , 2026 | 12:08 AM
మండలంలో వేరుశనగ సిరులు కురిపించింది. 415 ఎకరాల్లో సాగుచేయగా అధిక దిగుబడి రావడం, మంచి ధర రావడంంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎకరాకు 55-60 బస్తాల దిగుబడి, రూ.1.2లక్షల లాభం
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
రుద్రవరం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): మండలంలో వేరుశనగ సిరులు కురిపించింది. 415 ఎకరాల్లో సాగుచేయగా అధిక దిగుబడి రావడం, మంచి ధర రావడంంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎకరాకు 60 బస్తాల దిగుబడి
ఎకరాకు 55 నుంచి 60 బస్తాలు దిగుబడి రాగా, బస్తా రూ.3వేల నుంచి రూ.3,200ల వరకు ధర పలకడంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బస్తాకు 40 కేజీలు కాగా, తరుగు 4కేజీలు తీసుకున్నారు. గతంలో కంటే ప్రస్తు తం వేరుశెనగపంట పంట దిగుబడి రైతుల ఆశలను నిలబెట్టింది. అప్పులు తీరాయి ఆనందంలో ఉన్నామని రైతులు తెలిపారు.
ఎకరాకు రూ.60వేల పెట్టుబడి
పంట సాగుకు ఎకరాకు రూ.60వేలు పెట్టుబడి పెట్టినట్లు రైతులు తెలిపారు. పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నామని, ప్రకృతి సహకరించడంతో వేరుశెనగ దిగుబడి అధికంగా వచ్చిందంటున్నారు. కాగా ఇతర పంటలు సాగుచేసి నష్టపోయిన రైతులు వేరుశనగలో లాభవం రావడంతో సాంత్వన పొందారు.
3 ఎకరాకు 180 బస్తాలు దిగుబడి
మూడెకరాల్లో వేరుశనగ సాగుచేశా 180 బస్తాలు వచ్చింది. ఎకరాకు 60వేలు చొప్పున లక్షా 80వేలు పెట్టుబడి పెట్టాను. మంచి లాభం వచ్చింది. పంట దిగుబడి బాగా రావడంతో సంతోషంగా ఉంది. - వెంకటేశ్వర్లు, రుద్రవరం
దిగుబడి బాగా వచ్చింది
ఐదెకరాల్లో వేరుశనగ సాగుచేశా. దిగుబడి బాగా వచ్చింది, ధర కూడా ఉండటంతో సంతోషంగా ఉంది. - దస్తగిరి, రుద్రవరం