హరిత కర్నూలు లక్ష్యం
ABN , Publish Date - Jun 06 , 2026 | 12:16 AM
పచ్చదనంతో కూడిన హరిత కర్నూలుయే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కలెక్టర్ ఏ.సిరి అన్నారు.
కలెక్టర్ ఏ.సిరి
కర్నూలు న్యూసిటీ, జూన్ 5(ఆంధ్రజ్యోతి): పచ్చదనంతో కూడిన హరిత కర్నూలుయే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కలెక్టర్ ఏ.సిరి అన్నారు. శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ హాలులో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్-2026 అమలుపై నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో కలెక్టర్‌తో పాటు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ నగరంలో ప్రతిరోజు ఉత్పత్తి అవుతున్న భారీ మొత్తంలో చెత్తను శాస్త్రీయంగా నిర్వహించడం అత్యవసమరన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ ప్రకారం ప్రతి ఇంటికి నాలుగు రంగుల డస్ట్‌బిన్‌లు అందజేయనున్నట్లు ఆమె తెలిపారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లా డుతూ విస్తరిస్తున్న ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు అవసర మన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ స్ఫూర్తితో పచ్చదన పరిరక్షణ, కాలుష్య నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. పర్యావరణ పరి రక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని నగర పాలక సంస్థ కమిష నర్ చల్లా ఓబులేసు పిలుపునిచ్చారు. డీఆర్‌వో వెంకట నారాయణమ్మ, ఆర్‌డీవో సందీప్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.