గోశాలలో పచ్చిమేత
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:25 PM
కర్నూలు శివారులోని గోశాలలోని ఆవులకు పచ్చిమేత అందించాలని కలెక్టర్ డా. సిరి అన్నారు. బుధవారం పచ్చిమేత సాగును కలెక్టర్ పరిశీలించారు.
పీఎండీఎస్ విధానంతో గ్రాసాన్ని పెంచండి
కలెక్టర్ ఏ. సిరి
కర్నూలు అగ్రికల్చర్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కర్నూలు శివారులోని గోశాలలోని ఆవులకు పచ్చిమేత అందించాలని కలెక్టర్ డా. సిరి అన్నారు. బుధవారం పచ్చిమేత సాగును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకులతో కలెక్టర్ మాట్లాడుతూ గోశాలలో ఉన్న 1,100 ఆవులకు పీఎండీఎస్ విధానంలో సాగు చేసి పచ్చగడ్డిని అందించాలని అన్నారు. ఎల్‌నినో నేపథ్యంలో జిల్లాలో పీఎండీఎస్ సాగు విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యాన, పశుసంవర్థక శాఖల ఆధ్వర్యంలో 1,56,224 ఎకరాల్లో పీఎండీఎ్‌సను సాగు చేయించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ విధానంలో నవధాన్యాల సాగు వల్ల వచ్చిన మేతను గోశాలలో ఉన్న ఆవులకు ఉపయోగించడం జరుగుతుందని, ఆ మేతను తినడం వల్ల గోవులు ఆరోగ్యంగా ఉంటాయని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ మాధురి, పశుసంవర్థకశాఖ అధికారి రాజశేఖర్, కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు, ఉద్యాన శాఖ అధికారి రాజా కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.