గడ్డివామి, ట్రాక్టర్ దగ్ధం
ABN , Publish Date - May 11 , 2026 | 12:04 AM
మండలంలోని అంబాపురం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున గడ్డివామి, ట్రాక్టర్ దగ్ధమయ్యాయి. ఎస్‌ఐ రమేష్ బాబు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన సురేంద్రనాథ్ రెడ్డి కల్లంలో గడ్డివామి పక్కనే ట్రాక్టర్‌ను ఉంచారు
రూ.5.5లక్షల నష్టం
బేతంచెర్ల, మే 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అంబాపురం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున గడ్డివామి, ట్రాక్టర్ దగ్ధమయ్యాయి. ఎస్‌ఐ రమేష్ బాబు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన సురేంద్రనాథ్ రెడ్డి కల్లంలో గడ్డివామి పక్కనే ట్రాక్టర్‌ను ఉంచారు. ఆదివారం తెల్లవారు జామున గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ట్రాక్టర్‌తో సహా గడ్డివామి దగ్ధమైంది. గడ్డి రూ.50వేలు, ట్రాక్టర్ విలువ రూ.5లక్షలు మొత్తం రూ.5.50 లక్ష/ ణష్‌ఫక్షలు నష్టపోయినట్లు బాధితుడు వాపోయాడు. సీఐ వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ రమేష్ బాబు సంఘటన స్థలాన్ని చేరుకొని పరిస్థితి బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం మంజూరు చేసేందుకు కృషి చేస్తానని హమీ ఇచ్చారు. కన్వీనర్ ఎల్ల నాగయ్య, జాకీరుల్లా బేగ్ ఉన్నారు.