Share News

కేంద్ర మంత్రికి ఘన స్వాగతం

ABN , Publish Date - Aug 19 , 2026 | 12:05 AM

మండలంలోని కొమరోలు, పాలకొలను, చింతలపల్లె గ్రామాల్లోని డ్రోన ఇండస్ర్టీస్‌ సీఈవోలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి పాల్గొనేందుకు మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కేంద్ర, పౌర విమానాయన శాఖ మంత్రి కింజారపు రామ్మో హన నాయుడుకు ఎయిర్‌పోర్టులో పలువురు ఘనస్వాగతం పలికారు.

కేంద్ర మంత్రికి ఘన స్వాగతం
ఎయిర్‌పోర్టులో కేంద్ర మంత్రి రామ్మోహన నాయుడికి స్వాగతం పలుకుతున్న ఎంపీ బస్తిపాటి నాగరాజు

ఓర్వకల్లు, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): మండలంలోని కొమరోలు, పాలకొలను, చింతలపల్లె గ్రామాల్లోని డ్రోన ఇండస్ర్టీస్‌ సీఈవోలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి పాల్గొనేందుకు మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కేంద్ర, పౌర విమానాయన శాఖ మంత్రి కింజారపు రామ్మో హన నాయుడుకు ఎయిర్‌పోర్టులో పలువురు ఘనస్వాగతం పలికారు. ఉదయం 11:44 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కలెక్టర్‌ ఏ.సిరి, ఎస్పీ విక్రాంత పాటిల్‌, ఏపీ స్టేట్‌ సైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గీతాంజలి, ఎంపీ బస్తిపాటి నాగరాజు, కర్నూలు ఆర్డీవో సందీప్‌ కుమార్‌, తహసీల్దార్‌ విద్యాసాగర్‌, నందికొట్కూరు టీడీపీ ఇనచార్జి గౌరు వెంకటరెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందరెడ్డి, మం డల కన్వీనర్‌ బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, హుశేనాపురం సింగిల్‌ విండో చైర్మన సుధాకర్‌ రెడ్డి, టీడీపీ నాయకులు వెంకటరమణ, పుసులూరు ప్రభాకర్‌ రెడ్డి, శ్రీరాములు, రాంభూపాల్‌ రెడ్డి, ఆయా శాఖల అధికారులు, జిల్లా నాయకులు కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్నం 12:19 గంటలకు డ్రోన సిటీ ప్రాంతానికి చేరుకుని 12:20 నుంచి ఒంటి గంట వరకు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఆయన పరిశీలించారు. ఒంటి గంట నుంచి 2 గంటల వరకు సీఈవోలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. 2.50 గంటలకు విలేకరుల సమావేశాన్ని నిర్వహించి భోజ నం అనంతరం కర్నూలుకు బయలుదేరి వెళ్లారు. 5:51 గంటలకు ఓర్వ కల్లు విమానశ్రయానికి చేరుకుని అక్కడ ఉన్న డ్రోన డెమోను పరిశీ లించారు. అనంతరం కలెక్టర్‌ డా.సిరి, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఐఏఎస్‌ అధికారి గీతాంజలి వీడ్కోలు పలికారు.

Updated Date - Aug 19 , 2026 | 12:05 AM