Share News

వైభవంగా స్వామి, అమ్మవార్ల పల్లకీ సేవ

ABN , Publish Date - Jun 28 , 2026 | 11:20 PM

శ్రీశైల భ్రమ రాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు నిత్యకైంక ర్యాలు యధావిధంగా జరిపించి, పల్లకి సేవ చేసినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

వైభవంగా స్వామి, అమ్మవార్ల పల్లకీ సేవ
ఆదిదంపతులకు పూజలు చేస్తున్న అర్చకులు

శ్రీశైలం, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల భ్రమ రాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు నిత్యకైంక ర్యాలు యధావిధంగా జరిపించి, పల్లకి సేవ చేసినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం సాయంత్రం అమ్మవారి ప్రాకారమండపంలో వివిధ ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన పల్లకిలో స్వామి, అమ్మవార్ల ఉత్సమూర్తులను ఆశీనులజేసి ఊరేగించారు. అదే విధంగా శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా కళారాధన వేధికపై సంప్రదాయ నృత్య నీరాజనం సమర్పించారు. హైదరాబాద్‌కు చెందిన యం ఎల్‌ ఏ ఆర్ట్స్‌ అండ్‌ ఈవెంట్స్‌ వారిచే పలు భక్తిగీతాలకు కళాకారులు చేసిన నృత్యాలు భక్తులను అలరించాయి.

Updated Date - Jun 28 , 2026 | 11:20 PM