Share News

ఘనంగా తొలి ఏకాదశి పూజలు

ABN , Publish Date - Jul 25 , 2026 | 11:58 PM

మహానంది క్షేత్రంలో తొలి ఏక దశిని పురస్కరిం చుకొని ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ఘనంగా పూజలు నిర్వహించారు.

 ఘనంగా తొలి ఏకాదశి పూజలు

మహానందికి పోటెత్తిన భక్తులు

మహానంది, జూలై 25 (ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో తొలి ఏక దశిని పురస్కరిం చుకొని ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ఘనంగా పూజలు నిర్వహించారు. శనివారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని అలంకార మంటపంలో గణపతి, పుణ్య హవాచనము పూజలను జరిపిన అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులకు తిరుమంజనం, విశేష అభిషేకార్చన పూజలను జరిపారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున ఆలయ ప్రాంగణంలోని రుద్రగుండం కోనేరుతో పాటు రెండవ ప్రాకారంలోని పూల కోనేర్లల్లో పుణ్య స్నానాలచరించారు. ఉదయం 6గంటలకు స్వామి అమ్మవార్లకు ఇచ్చే మహా మంగళ హారతి సేవల్లో పాల్గొ న్నారు. సాయంత్రం వరకు ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి కనిపిం చింది. ప్రధాన అర్చకుడు మామిళ్లపల్లి అర్జునశర్మ, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2026 | 11:58 PM